వైవాహిక అత్యాచారాలపై ఇకనైనా నోరు విప్పండి: కత్రినా కైఫ్
మహిళలు తమపై జరుగుతున్న వైవాహిక అత్యాచారాలు, హింసలపై మౌనం వహించడం తగదని, ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్న మహిళలు ఇకనైనా నోరు విప్పాలి, ధైర్యంగా తమ బాధలను బయటకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.
ముంబై: మహిళలు తమపై జరుగుతున్న వైవాహిక అత్యాచారాలు, హింసలపై మౌనం వహించడం తగదని, ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్న మహిళలు ఇకనైనా నోరు విప్పాలి, ధైర్యంగా తమ బాధలను బయటకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యానించారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.
ముంబైలో జరిగిన 'వి యునైట్' కాన్ఫరెన్సులో కత్రినా కైఫ్ ఈ వ్యాఖ్యలు చేసారు. మహిళలు తముక జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పినప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. కానీ చాలా మంది తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకోవడం లేదని, చదువుకున్న మహిళలు సైతం సమాజానికి, కట్టుబాట్లకు భయపడి ఈ విషయాలను దాస్తున్నారని, ఇలా చేయడం మంచి పద్దతి కాదని అన్నారు.

సమాజం కూడా వైవాహిక అత్యాచారాలను... అత్యాచారాలుగా గుర్తించడం లేదని, సమాజంలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందని కత్రినా కైఫ్ అన్నారు. ఇలాంటి సమస్య కేవలం ఇండియాలో మాత్రమే లేదని, ప్రపంచంలో ప్రతి చోటా ఉందన్నారు.
ఓ సర్వే ప్రకారం ఇండియాలో 2001లొ మహిళలపై 1,43,795 నేరాలు జరిగాయి. 2005లో ఆ సంఖ్య 3,27,394కు పెరిగింది. వంద శాతం కంటే ఎక్కువే మహిళలపై క్రైమ్ రేటు పెరిగింది. మహిళలు ధైర్యంగా తమపై జరిగిన నేరాలను బయటకు చెప్పినపుడే ఈ సంఖ్య తగ్గుతుందన్నారు.


Click it and Unblock the Notifications











