మనవరాలి ఫోటోలు అమ్ముకోను: బిగ్ బి
తన మనవరాలి ఫోటోలు అమ్ముకునే ప్రసక్తే లేదని బిగ్ బి అమితాబ్ తేల్చి చెప్పారు. ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఐశ్వర్య-అభిషేక్ లకు పుట్టిన బేబీ తొలి ఫోటోకు రూ. 5 కోట్లు ఆఫర్ చేశారని, బిగ్ బి కుటుంబం ఇంత కంటె ఎక్కువ మొత్తంలో ఆఫర్ కోసం ఎదురు చూస్తోందని మీడియాలో ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన పై విధంగా తన ట్విట్టర్ లో స్పందించారు. తాము బేటి బి ఫోటోను అమ్ముకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను ఖండించారు. ఇలాంటి కథనాలను అర్థంపర్థం లేని చౌకబారు కథనాలుగా అభివర్ణించారు బిగ్ బి.
అందాల తార ఐశ్వర్య రాయ్ అందమైన ఆడపిల్లకు నవంబర్ 16న జన్మనిచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ 22న ఐష్ డిచ్చార్జ్ అయి ఇంటికి వెళ్లంది. ప్రస్తుతం బచ్చన్ కుటుంబ సభ్యులు ఆమెను బేటి బి అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఐశ్వర్య కూతురు ఫోటో బచ్చన్ కుటుంబం బయటకు విడుదల చేయక పోవడంతో పై విధంగా మీడియాలో రకరకాలు గా ప్రచారం జరుగుతోంది. హీలీవుడ్ స్టార్ట్స్ మాదిరి...ఈ బాలీవుడ్ స్టార్ కూడా తమ ఇంటి బిడ్డ తొలి ఫోటోను మీడియాకు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారనేది ఆ కథనాల సారాంశం.


Click it and Unblock the Notifications











