శ్రీనివాస కళ్యాణం వర్కింగ్ స్టిల్.. మెరిసిపోతున్న నితిన్, రాశి!
నితిన్ నటిస్తున్న తాజా చిత్రం శ్రీనివాస కళ్యాణం. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శతమానం భవతి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఘన విజయం సాధించింది. శ్రీనివాస కళ్యాణం కూడా అదే జోనర్ లో తెరకెక్కుతుండడం విశేషం.

రాశిఖన్నా, నితిన్ ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. సాంప్రదాయ వివాహాల ప్రాముఖ్యతని తెలియసే కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దాదాపు 15 ఏళ్ల తరువాత దిల్ రాజు, నితిన్ కాంబినేషన్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మిక్కిజె మేయర్ ఈ చిత్రానికి సంగీత అందిస్తున్నాడు. శ్రీనివాస కళ్యాణం ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలై అందరిని అలరించిన సంగతి తెలిసిందే.
శ్రీనివాస కళ్యాణం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆగష్టులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహకాలు చేస్తున్నారు. తాజగా షూటింగ్ లొకేషన్ లో నితిన్ తో కలసి దిగిన ఫోటోని రాశి ఖన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో నితిన్, రాశి మెరిసిపోతున్నారు.


Click it and Unblock the Notifications











