ఎన్టీఆర్ 'శక్తి' చిత్రానికి వరల్డ్ కప్ పెద్ద దెబ్బ!?
జూ ఎన్టీఆర్ తాజా చిత్రం 'శక్తి' రేపు(ఏప్రియల్ 1)న ప్రపంచమంతటా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ దెబ్బకొట్టనుంది. శ్రీలంకతో ఇండియా తలబడే ఈ మ్యాచ్ ఏప్రియల్ రెండవ తేదీ శనివారం జరగనుంది. ఇండియా నిన్నటి(బుధవారం) మ్యాచ్ లో విజయం సాధించటంతో అంతటా ఈ మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొని ఉంటుంది. ఆ రోజు జనం అంతా టీవీ సెట్స్ కు అతుక్కుపోయి ఉంటాయి. విడుదలైన రెండో రోజే ఇలా జరిగటం గ్యారెంటీగా కలెక్షన్స్ పై గట్టి దెబ్బ కొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ జరుగుతున్న రోజులూ సినిమా ధియోటర్స్ లో జనం లేక వెలతెలాపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి హిట్ టాక్ వస్తే ఆ ఒక్క రోజు డల్ అయినా పెద్ద ఎఫెక్టు పడకపోవచ్చుకానీ, అదే ఏమన్నా తేడా అయితే మాత్రం రెండో రోజు ఈ క్రికెట్ ఫీవర్ లో దాని విషయం పూర్తిగా మర్చిపోయే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











