‘విశ్వరూపం’ వరల్డ్ ప్రీమియర్ షో(ఫోటోలు)
హైదరాబాద్ : విశ్వరూపం చిత్రం వరల్డ్ ప్రీమియర్ షోను లాస్ ఏంజిల్స్‌లోని పసిఫిక్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి బార్రీ ఒస్బోర్న్ తో పాటు పలువురు హాలీవుడ్ ప్రముఖులు, చిత్ర తారాగణం కమల్ హాసన్, పూజా కుమార్, ఆండ్రియా, శేఖర్ కపూర్, సామ్రాట్ తదితరులు హాజరయ్యారు.
ఇక పోతే...విశ్వరూపం చిత్రం అన్ని అడ్డంకులను తొలగించుకుని తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. తాజాగా ఈచిత్రం కలెక్షన్స్ రూ. 100 కోట్లు దాటాయి. ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా నటించిన రాహుల్ బోస్ తన ట్విట్టర్ ద్వారా ఈ వియాన్ని వెల్లడించారు.
'తాజాగా అందిన సమాచారం ప్రకారం విశ్వరూపం చిత్రం ఇండియాలో రూ. 120 కోట్లు వసూలు చేసింది. నేను నటించిన సినిమాల్లో 100 కోట్లు క్రాసైన సినిమా ఇదే. కమల్ హాసన్ తో పాటు విశ్వరూపం సినిమా టీం మొత్తానికి అభినందనలు' అంటూ రాహుల్ బోస్ ట్వీట్ చేసారు.

అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో విశ్వరూపం వరల్డ్ ప్రీమియర్ షో కు హాజరైన సినీ ప్రముఖులు

విశ్వరూపం చిత్రం జనవరి 25న విడుదల కావాల్సి ఉండగా ముస్లిం సంఘాల ఆందోళన కారణంగా ఈచిత్రం ప్రదర్శన తమిళనాడులో నిలిపి వేసారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటకల్లో కూడా ఒకటి రెండు రోజులు ఆలస్యంగా విడుదలయింది. అయితే హిందీలో మాత్రం ముందుగా అనుకున్న సమయానికే విడుదల చేసారు. తమిళనాడులో ముస్లిం సంఘాలతో చర్చల అనంతరం ఫిబ్రవరి 7న అక్కడ విడుదలైంది. కమల్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూ. 95 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు.

Click it and Unblock the Notifications