టాప్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గా జక్కన్న వరల్డ్ రికార్డ్.. ఇండియాలోనే ప్రత్యేకమైన వ్యక్తిగా..
దర్శకధీరుడు రాజమౌళి కి, ఆయన సినిమాలకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈయన ఇప్పటి వరకు తెరకెక్కించిన ప్రతీ చిత్రం హిట్టుగానే నిలిచింది. ఎప్పటికప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ అద్భుతమైన చిత్రాలను ఆవిష్కరించే ఈయన బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
కేవలం రికార్డుల పరంగానే కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ రావడం మరో గొప్ప విషయం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా చేసిన ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడంతో రాజమౌళి ఖ్యాతి విశ్వవ్యాప్తం అయింది. ఈ క్రమంలోనే ఆయనకు మరో అద్భుతమైన స్థానం లభించింది.

తాజాగా ఈయన మరో అరుదైన ఘనతను సాధించాడు. 2023కు గాను ప్రఖ్యాత టైమ్ మేగజీన్ విడుదల చేసిన 100 మంది ఇన్ ఫ్లూయెన్సర్స్ జాబితాలో జక్కన్న చోటు దక్కించుకున్నాడు. టాప్ 100 మెంబర్ ఇన్ ఫ్లూయెన్సర్ లో రాజమౌళి ఒకరు కావడం నిజంగా హర్షించ దగ్గ విషయమే.
అంతే కాదండోయ్ ఇదే జాబితాలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కూడా స్థానం దక్కించుకున్నారు. రాజమౌళికి ఐకానిక్ క్యాటగిరీలో అలాగే షారుఖ్ ఖాన్ కు పయోనీర్స్ క్యాటగిరీలో చోటు దక్కించుకున్నారు. అలాగే రచయిత సల్మాన్ రష్దీ, బుల్లితెర ప్రయోక్త, నాయనిర్ణేత పద్మాలక్ష్మీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ రాజు చార్లెస్, స్పేస్ ఎక్స్ వ్యస్థాపకులు ఎలాన్ మస్క్, ప్రఖ్యాత గాయని బియాన్స్ తదితరులు ఈ జాబితాలో నిలిచారు.
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా తీయబోతున్నట్లు ప్రకటించారు. అయితే మిల్క్ బాయ్ తో అదీ జక్కన్న సినిమా తీస్తాడని తెలిసినప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకన్నాయి. అందులోనూ పాన్ ఇండియా సినిమా అంటుండంతో అంతా తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జక్కన్న ఈ సినిమా స్క్రిప్టుపై పని చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











