ఆసియా శృంగార తారగా ప్రియాంక
ముంబై: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఆసియాలోనే సెక్సియెస్ట్ ఉమన్(శృంగార తార)గా స్ధానం దక్కించుకుంది. తాము జరిపిన ఆన్ లైన్ సర్వేలో.....ఈ విషయం తేలినట్లు ఓ మేగజైన్ వెల్లడించింది. గతంలో ఈ స్థానాన్ని దక్కించుకున్న కత్రినా కైఫ్, కరీనా కపూర్లను ఈ సారి ప్రియాంక చోప్రా అధిగమించడం విశేషం. ఈ సారి కరీనా 2వ స్థానంలో, కత్రినా మూడవ స్థానంలో నిలిచింది.
మాజీ ప్రపంచ సుందరి అయిన ప్రియాంక తన నటన జీవితాన్ని ప్రారంభించక ముందు, మోడల్‌గా పని చేసిన ఆమె 2000వ సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకున్న తరువాత పాపులర్ అయింది. 2003వ సంవత్సరంలో తన మొట్టమొదటి బాలీవుడ్ చిత్రం ది హీరో: లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఆ చిత్రాన్ని తక్కువగా అంచనా వేసినప్పటికీ ఆ సంవత్సరానికి అత్యధిక వసూళ్లు చేసిన చిత్రం అయ్యింది.
అక్షయ్ కుమార్ సరసన నటించిన ఆమె తర్వాత చిత్రం అందాజ్ విజయవంతంగా ప్రదర్శింపబడింది, ఈ చిత్రంలో మంచి నటనకు ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ మహిళా రంగప్రవేశ పురస్కారం లభించింది మరియు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారానికి ప్రతిపాదించబడింది.
ప్రస్తుతం ప్రియాంక చోప్రా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న బాలీవుడ్ చిత్రం జంజీర్ లో నటిస్తోంది. ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది గతంలో వచ్చిన అమితాబ్ సూపర్ హిట్ మూవీ 'జీంజర్'కు రీమేక్. అమితాబ్ కు సంబంధించిన రీమేక్ మూవీలో నటించడం ప్రియాంకకు ఇది మూడోసారి. గతంలో ప్రియాంక చోప్రా అమితాబ్ నటించిన డాన్(1978), అగ్నిపథ్(1990) చిత్రాలకు రీమేక్ గా వచ్చిన చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











