రామ్ చరణ్ ‘ఎవడు’ కోసం భారీ సెట్

By Bojja Kumar

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తాజాగా నటిస్తున్న 'ఎవడు' చిత్రం కోసం అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేస్తున్నారు. ఇందు కోసం రూ. 70 లక్షలు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్‌లో హీరో హీరోయిన్లపై పాటను చిత్రీకరించబోతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన రామ్ చరణ్ సినిమాలకు భిన్నంగా ఈచిత్రం ఉండబోతోంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో రామ్ చరణ్ సరసన సమంత, అమీజాక్సన్ రొమాన్స్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర డిఫెరెంట్ గా ఉండనుంది.

గుడిని మింగేవాడుంటే, ఆ గుడిలోని లింగాన్ని కూడా స్వాహా చేసేవాడు ఒకడుంటాడు. ఒక బంతికి ఆరు పరుగులు కొడితే, ఏడో పరుగుకీ దౌడు తీసేవాడొకడు వస్తాడు. తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడూ ఉంటాడు. అలాంటివాడే రామ్‌చరణ్‌.

ఈ చిత్రంతో పాటు చెర్రీ బాలీవుడ్ మూవీ 'జంజీర్'లో, వివి వినాయక్ దర్శకత్వంలో మరో చిత్రానికి కమిట్ అయ్యారు. జూన్ 14న ఉపాసనతో చెర్రీ వివాహం ఖరారైన నేపథ్యంలో కొన్ని రోజుల పాటే సినిమా షూటింగులకు బ్రేక్ ఇవ్వనున్నాడు ఈ మెగా పవర్ స్టార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X