వాటే రొమాన్స్ : సల్మాన్ 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' సాంగ్ (వీడియో)
హైదరాబాద్: సల్మాన్ ఖాన్, సోనమ్ కపూర్‌లు జంటగా నటిస్తున్న 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రంలోని ఓ కొత్త గీతం విడుదలైంది. సోనమ్ కపూర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ఈ చిత్రానికి సూరజ్ బర్‌జాత్యా దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్, సోనమ్‌లతోపాటు అనుపమ్ ఖేర్, నీల్ నితిన్ ముఖేష్‌లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ హై కౌన్ చిత్రాలను భారతీయులు ఎప్పటికి మరిచిపోలేరు. ఆ చిత్రాల్లో ప్రేమ్ గా సల్మాన్ అందరి మనస్సులో గుర్తుండిపోయేలా లవ్ లీగా చేసేసి భారతావనని తన ప్రేమ కథలతో ఊపేసాడు. అయితే ఆ చిత్ర దర్శకుడుతో ఆయన మళ్లీ చిత్రం చేయలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది.
బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్ హీరోగా సూరజ్ బర్‌జాత్యా దర్శకత్వంలో 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.
మైనే ప్యార్ కియా, హమ్ ఆప్ హై కౌన్ చిత్రాలను భారతీయులు ఎప్పటికి మరిచిపోలేరు. ఆ చిత్రాల్లో ప్రేమ్ గా సల్మాన్ అందరి మనస్సులో గుర్తుండిపోయేలా లవ్ లీగా చేసేసి భారతావనని తన ప్రేమ కథలతో ఊపేసాడు. అయితే ఆ చిత్ర దర్శకుడుతో ఆయన మళ్లీ చిత్రం చేయలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది. బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్ హీరోగా సూరజ్ బర్‌జాత్యా దర్శకత్వంలో 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.
గతంలో సల్మాన్‌ఖాన్‌తో దర్శకుడు సూరజ్ బర్‌జాత్యా మైనే ప్యార్ కియా, హమ్ సాత్ సాత్ హై,హమ్ ఆప్ కే కౌన్ వంటి సూపర్‌హిట్ చిత్రాలను తీశాడు. ఈ కాంబినేషన్ తాజాగా నాలుగోసారి ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది.
అలాగే..విజయ్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన 'కత్తి' చిత్రం తెలుగులో రీమేక్ అవుతుందని చాలా కాలాంగా ఊరిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఈ చిత్రం చూసి రీమేక్ కు ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు వెర్షన్ విషయమై కాపీ రైట్ కేసు ఉండటంతో ఆగిపోయిందని వినికిడి. అయితే ఇప్పుడు ఈ చిత్రం హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...
సౌత్ సినిమా రీమేక్‌ల్లో నటించడానికి ఆసక్తి కనబరుచే సల్మాన్ ఈ చిత్రం రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్ నటించబోతున్నాడు అనే మాట కొంత కాలంగా వినిపిస్తుంది. తాజాగా మురుగదాస్ 'కత్తి' హిందీ రీమేక్‌లో నటించడానికి సల్లూభాయ్ పచ్చ జెండా వూపేశాడని సమాచారం.

''మురుగదాస్ చెప్పిన కథ సల్మాన్‌కు బాగా నచ్చినా ఆయన కోర్టు కేసుల్లో ఉండటంతో అప్పట్లో ఓకే చెప్పలేదు. ప్రస్తుతం ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ చిత్రాన్ని అతుల్ అగ్రి హోత్రి నిర్మిస్తారు'' అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఇక సల్మాన్ ఖాన్ హీరోగా రూపుదిద్దుకుంటున్న 'సుల్తాన్' చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్,సల్మాన్ ఖాన్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ తల్లిగా అలనాటి ప్రముఖ నటి రేఖ నటిస్తున్నారు. 2016 రంజాన్‌కి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











