మూడు సినిమాలు పూర్తి చేసిన సమంత
తాను నటిస్తున్న మూడు సినిమాల షూటింగులు ఒకే నెలలో పూర్తి కావడంతో సంతోషంగా ఉన్న సమంత తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'మహానటి'లో సమంత ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఈ షూటింగ్ పూర్తవ్వడంతో ఆమె ట్వీట్ చేశారు.

''మహానటి' పూర్తైంది. ఈ నెలలో మూడు సినిమాల షూటింగ్ పూర్తి చేసుకున్నా. వైజయంతి మూవీస్ సంస్థ, నాగ్‌అశ్విన్ తీస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రంలో నటించడం చాలా గౌరవంగా భావిస్తున్నా. ఈ అద్భుతమైన అనుభూతిని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు' అని సమంత ట్వీట్ చేశారు.
సమంత నటించిన 'రంగస్థలం' షూటింగ్ పూర్తి చేసుకుని మార్చి 30న విడుదలవుతోంది. దీంతో పాటు ఆమె తమిళంలో నటించిన మరో చిత్రం షూటింగ్ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.


Click it and Unblock the Notifications











