'వినాయకుడు' సినిమా టైటిల్, టాగ్ లైన్ , పోస్టర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలైన సంగతి తెలిసిందే. అయితే అటువంటివి చెల్లవంటూ వ్యాజ్యాన్ని బుధవారం కొట్టివేసింది. హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి దాఖలు చేసిన రిట్ పై హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనిల్ రమేశ్ దవె, జస్టిస్ ఆర్. సుభాష్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. అభ్యంత రాలన్నింటినీ ఫిలిం చాం బర్ దృష్టికి తీసుకెళ్ళాలని సూచించింది.ఇక ఈ కృష్ణుడు,సోనియా జంటగా నటించిన ఈ సినిమా మంచి రొమాంటిక్ కామిడీగా అంతటా ప్రశంసలు అందుకుంటూ మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటోంది.