Don't Miss!
- News రెండో రోజు నామినేషన్ల జోరు: 69 నామినేషన్లు వేసిన 57 మంది అభ్యర్థులు, ప్రముఖులు వీరే
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
వరుణ్ సందేశ్ 'కుదిరితే కాఫీ కప్పు' చూసారా? రివ్యూ రాసి పంపండి
వరుణ్ సందేశ్ తాజా చిత్రం "కుదిరితే కాఫీ కప్పు" చూసారా. చిత్రంపై మీ అభిప్రాయాలను ప్రపంచంలో మరికొందరితో పంచుకోవాలని ఉందా..అందుకు ధట్స్ తెలుగు అధ్బుతమైన అవకాశం కలిపిస్తోంది. ఈ చిత్రంపై మీరు రాసే అమూల్యమైన అభిప్రాయాలకు, ఆలోచనలకు ఈ వెబ్ సైట్ వేదిక కానుంది. సెటైర్ కామిడీగా తీసిన ఈ చిత్రం మీకు నచ్చినా,లేక నచ్చకపోయినా ఏదైనా మీరు నిర్మహమాటంగా రాసి పంపించండి. సినిమా నచ్చితే ఏమి బాగున్నాయి..కధా, స్క్రీన్ ప్లేనా,దర్శకత్వమా, నటీనటల భావప్రకటనా సామర్ధ్యమా, నిర్మాణ విలువలా, సాంకేతిక విలువలా..అనేది స్పష్టంగా చిన్నగా రెండు పేరాల్లో రాసి పంపించండి. అలాగే నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు.ఇంకా ఏయే అంశాలు ఈ చిత్రంలో ఉంటే బాగుంటాయి అన్నది మీరు రాసి పంపవచ్చు. ఈ సైట్ పాఠకుల్లో సినిమావారు కూడా ఉన్నారు. వారికీ మీ అభిప్రాయాలు నేరుగా చేరే అవకాశం ఉంది. మీ మెయిల్ ఐడిని క్లియర్ గా రాస్తూ...రివ్యూ పంపండి.మీ పేరుతో ప్రచురిస్తాం. అలాగే అసభ్యకరమైన పదజాలం వాడవొద్దు. రివ్యూని తిరిగి ఎడిట్ చేసే అధికారం మాకు కలదు. మంచి రివ్యూలకు ప్రథమ స్థానం లభిస్తుంది. మొహమాటం వద్దు, రాయగలమో లేదో అనే సందేహాలూ వద్దు. రాసి పంపండి, ఆలస్యం ఎందుకు? మీ రివ్యూలను [email protected] అనే మెయిల్ అడ్రసుకు పోస్టు చేయండి.