యువహీరోకు విలన్ గా నటించబోతున్న రైటర్ అబ్బూరి రవి!
యువ హీరో ఆది ఈ మద్య చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న ఈ హీరో ప్రస్తుతం విశ్వనాథ్ ఆరిగేల అనే కొత్త డైరెక్టర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందట. సమ్మర్ లో రిలీజ్ అవకాశం ఉందని సమాచారం.
తాజాగా ఆది మరో చేస్తున్నాడు, వినాయకుడు, కేరింత చిత్రాల దర్శకుడు సాయి కిరణ్ అడవి తో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. యూత్ పుల్ ఎంటర్ టైనర్ గా సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఎయిర్ టెల్ 4జి గర్ల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

తాజా సమాచారం మేరకు బొమ్మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్, పంజా,ఊపిరి, కిక్ వంటి సినిమాలకు రచయితగా పనిచేసిన అబ్బూరి రవి ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో ఆది మంచి విజయం సాధిస్తాడేమో చూద్దాం.


Click it and Unblock the Notifications











