ఎవరీ అభిలాష..., బాలయ్య గురించి ఎందుకలా? వైరల్ వీడియో!

By Bojja Kumar

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఈ రోజు విడుదలై అన్ని వర్గాల నుండి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. బాలయ్య 100వ చిత్రం విడుదల సందర్భంగా ఓ అభిమాని రాసిన పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది.

శత చిత్ర తారా... తారక రామ పుత్ర బాలకృష్ణ అంటూ రాసిన ఈ పాట ఇపుడు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ పాటను రాసింది, డైరెక్ట్ చేసింది.... అభిలాష అనే రచయిత్రి. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విడుదల సందర్భంగా ఈ సాంగును డెన్మార్క్ లోని పలు థియేటర్లలో ప్లే చేసినట్లు తెలుస్తోంది.

సినిమా రిలీజ్ ముందు ఇటీవల ప్రసాద్ ల్యాబ్స్ లో బాలయ్య అభిమానుల మీటింగ్ సందర్భంగా కూడా ఈ పాటను ప్లే చేసారు. బాలయ్య కూడా సాంగును చూసి రచయిత్రిని మెచ్చుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.

 Writer Abhilasha's song on Balakrishna goes viral

బాలయ్య గారు నాకు ఫోన్ చేసి పర్సనల్ గా మెచ్చుకున్నారు. చాలా మంది అభిమానులు ఈ పాటను తమ రింగ్ టోన్ గా పెట్టుకున్నారని చెప్పారు... బాలయ్య గారు ఫోన్ చేసి మెచ్చుకోవడం ఆనందంగా ఉంది అని అభిలాష తెలిపారు.

ఈ రచయిత 'గుండె చప్పుడు' అనే పుస్తకాన్ని కూడా రాసారు. ఈ పుస్తకాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి సెట్స్ లో రిలీజ్ చేసారు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' మూవీ గన విజయం సాధించడంపై అభిలాష సంతోషం వ్యక్తం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X