చిన్ని కృష్ణ ఒక చీటర్, అతడి బాగోతం బయటపెడతా.. ప్రముఖ రచయిత సంచలనం!

టాలీవుడ్ సీనియర్ రచయిత చిన్ని కృష్ణ ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చిన్ని కృష్ణ మీడియా సమావేశం నిర్వహించి మరీ పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇలా మెగా ఫ్యామిలీ మొత్తంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనితో సోషల్ మీడియాలో చిన్ని కృష్ణపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. తాజాగా ప్రముఖ రచయిత ఆకుల శివ చిన్ని కృష్ణకు కౌంటర్ ఇచ్చారు.

ఇస్తరాకు కూడా వేయలేదు

ఇస్తరాకు కూడా వేయలేదు

పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ మెగా ఫ్యామిలీపై కూడా చిన్ని కృష్ణ తీవ్రమైన విమర్శలు చేశారు. చిరంజీవి తాను ఇంద్ర లాంటి ఆల్ టైం హిట్ అందిస్తే ఏరోజూ ఇస్తరాకు వేసి భోజనం కూడా పెట్టలేదన్నారు. ఏ రోజూ కులం గురించి మాట్లాడని తాను ఈ రోజు మాట్లాడవలసి వస్తోందని, కాపులకు మెగా ఫ్యామిలీ మాత్రమే రెప్రజెంటేషన్ కాదని చిన్న కృష్ణ అన్నారు. తాము కూడా కాపులమే అని తెలిపారు.

 మెగా ఫ్యామిలీ కాపాడుతుందా

మెగా ఫ్యామిలీ కాపాడుతుందా

పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యల వలన తెలంగాణాలో దాడులు జరిగితే పవన్ కళ్యాణ్ అన్నలు, మెగాఫ్యామిలీ వచ్చి కాపాడుతుందా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ రాసే డైలాగులు చదువుతున్నారని విమర్శించారు. దీనితో మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో చిన్ని కృష్ణపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. తాజాగా చిన్ని కృష్ణ వ్యాఖ్యలపై ప్రముఖ రచయిత ఆకుల శివ స్పందించారు.

 అతడొక చీటర్

అతడొక చీటర్

ఆకుల శివ మాట్లాడుతూ చిన్ని కృష్ణ పెద్ద చీటర్. తన కెరీర్ మొత్తం అతడు పక్కవాడి వర్క్ ని కాపీ కొడుతూ వచ్చాడు అని ఆకుల శివ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలోనే చిన్ని కృష్ణ గురించి అసలు నిజాలు బయటపెడతానని ఆకుల శివ పేర్కొన్నారు. దీనితో రాజకీయ పరిణామాలు కాస్త టాలీవుడ్ వివాదాలుగా మారుతున్నాయి.

కేసీఆర్‌పై ఆగ్రహం

కేసీఆర్‌పై ఆగ్రహం

కేసీఆర్ ఆంధ్ర రాజకీయాల్లో వేలుపెడుతూ వైసీపీకి మద్దత్తు తెలుపుతున్నారని గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు వివాదభరితంగా మారుతున్నాయి. కేసీఆర్ కు ఆంధ్రరాజకీయాల్లో జోక్యం చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే నేరుగా ఇక్కడకు వచ్చి పోటీ చేయాలని పవన్ జనసేన పార్టీ ప్రచారంలో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X