చిరంజీవి భోజనం పెట్టి రూ.5 లక్షలు ఇచ్చారు.. తెనాలిలో అరెస్ట్ చేస్తే విడిపించింది నేను!
రచయిత చిన్ని కృష్ణ మెగా ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు మరింత వివాదంగా మారుతున్నాయి. ప్రముఖ రచయిత ఆకుల శివ చిన్న కృష్ణ వ్యాఖ్యలపై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. చిన్ని కృష్ణపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరొక్కసారి మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడితే నీ జాతకం మొత్తం బయటపెడతా అని ఆకుల శివ వార్నింగ్ ఇచ్చారు. నువ్వు నీచుడివి కాబట్టే చిరంజీవి గారు ఇంటికి పిలిచి భోజనం పెట్టలేదు అని ఆకుల శివ వ్యాఖ్యానించారు. తాను దర్శకుడిని కాకుండా చిన్ని కృష్ణ అడ్డుకున్నారు అంటూ ఆకుల శివ ఆరోపించారు.

నీచుడివి
ఆకుల శివ మాట్లాడుతూ.. తాను మురారి, లక్ష్మి , తులసి, నాయక్ ఇలా పలు విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేశానని అన్నారు. చిరంజీవి ఇంటికి పిలిచి భోజనం పెట్టలేదని చిన్ని కృష్ణ మాట్లాడాడు. నీవు ఎంత నీచుడివి కాకపోతే చిరంజీవి నీకు భోజనం పెట్టకుండా ఉంటారు. ఆ మాత్రం తెలియదా నీకు. సౌత్ ఇండియాలోనే చిన్ని కృష్ణ నీచుడు అంటూ ఆకుల శివ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

రూ. 5 లక్షలు ఇచ్చారు
నేను నాయక్ చిత్రానికి పనిచేశా. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ సమయంలో చిరంజీవిగారు నన్ను, వివి విజయక్‌ని ఇంటికి పిలిచారు. భోజనం పెట్టి రూ 5 లక్షలు డబ్బు ఇచ్చి తన 150వ చిత్రానికి కథ, మాటలు రాయమని అడిగారు. అది అయన సంస్కారం అని ఆకుల శివ తెలిపారు. తెనాలిలో చిన్న కృష్ణ సోదరుడి విషయంలో జరిగిన సంఘటనని కూడా ఆకుల శివ ప్రస్తావించారు.

బతిమాలాడుకున్నావు
తెనాలిలో మీ అన్నని పోలీసులు అరెస్ట్ చేశారు. తన సోదరుడిని విడిపించమని నన్ను బతిమాలాడుకున్నావు. హైదరాబాద్ నుంచి వచ్చి నాకున్న పరిచయాలు, మంచితనం ద్వారా మీ సోదరుడిని విడిపించా. ఆ సమయంలో ఎస్ఐ నిన్ను చూసి చెప్పిన మాటలు మరచిపోయావా అని ఆకుల శివ వ్యాఖ్యానించాడు. అలాంటి నీకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేత నీతి, నిజాయితీ ఉన్నాయా అని ఆకుల శివ ప్రశ్నించారు.

కులం చూసి తీసుకోరు
పవన్ కళ్యాణ్ గారి పరిచయం చేయమని ఎన్నిసార్లు నువ్వు బతిమాలాడలేదు. ఆయన నీలాంటి వాళ్ళని కలవరు. కులం చూసి ఎవరూ తీసుకోరు. గుణం చూసి తీసుకుంటారు. లక్ష్మి, తులసి చిత్రాలకు నేను పనిచేశా. సురేష్ బాబు నన్ను ఇంటికి పిలిచి ఎన్నోసార్లు భోజనం పెట్టారు. అనేకసార్లు ఆర్థిక సాయం కూడా చేశారు అని ఆకుల శివ ప్రస్తావించారు. తాను దర్శకుడు కాకుండా అడ్డుకున్నది చిన్ని కృష్ణే అని ఆకుల శివ ఆరోపించారు.

మందు కొట్టి ఏడ్చావు
ఇంద్ర చిత్రానికి నేను రాసిన చాలా డైలాగులు చిరంజీవి గారికి నచ్చాయి. టైటిల్ కార్డ్స్‌లో నాపేరు వేసుకోమన్నారు. కానీ నువ్వు ఆరోజు రాత్రి మందు కొట్టి ఏడ్చావు. పవన్ కళ్యాణ్ గారు నవరంధ్రాలు మూసుకునిపోయే పేజీలు తిరగేస్తావా.. నీ గురించి తిరగేయడానికి చాలా పేజీలు ఉన్నాయి. సమైక్య రాష్ట్రంలో తారా చౌదరి కేసు నుంచి తప్పించుకున్నావు. నీ జాతకం మొత్తం నాకు తెలుసు. మరొక్కసారి మెగా ఫ్యామిలీ గురించి మాట్లాడితే అవన్నీ బయట పెడతా అని ఆకుల శివ వార్నింగ్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











