భారవి ‘ఇంటింటా అన్నమయ్య

By Staff

Bharavi
'ఇంటింటా అన్నమయ్య" పేరుతో వచ్చే ఆరేడు నెలల్లో ఓ సినిమా రూపొందించనున్నట్లు రచయిత భారవి ప్రకటించారు. అన్నమయ్య కుటుంబం ఇతివృత్తంతో సాగే 'ఇంటింటా అన్నమయ్య" అనే ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుందని ఆయన వెల్లడించారు.తను కథ,మాటలు రాసిన అన్నమయ్య చిత్రంలాగానే ఈ చిత్రం కూడా హిట్ అయ్యేలా ఆశ్వరదించాలని ఆయన సభాముఖంగా కోరారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుల 601వ జయంతి సందర్భంగా సిలికానాంధ్ర, ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక శాఖ, తితిదే సంయుక్తంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమం లక్షగళ సంకీర్తనార్చనకు వేదికైంది.

ఈ సందర్భంలో భారవి ఈ ప్రకటన చేసారు. ఈ కార్యక్రమంలో సిలికానాంధ్ర ఛైర్మన్‌ కె.ఆనంద్‌, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, తితిదే ఈవో కె.వి.రమణాచారి, సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున దంపతులు, రచయిత భారవి, మంత్రులు పనబాక లక్ష్మి, మండలి బుద్ధప్రసాద్‌ పాల్గొన్నారు.అన్నమయ్య కీర్తనలు ఆలపించే గాయని శోభరాజ్‌ తనకు అవమానం జరిగిందంటూ మధ్యలోనే అలిగి వెళ్లిపోయారు.ఎప్పుడూ స్టేజీపై మాట్లాడని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కూడా గోవింద నామ స్మరణ చేసారు. అయితే ఎంతో భక్తి భావంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇలా సినిమా ప్రకటించటం చాలా మందిని నిరాశపరిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X