twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Waltair Veerayya: చిరంజీవికి చెడు అలవాట్లు, జోక్ కాదు బ్రదర్.. రైటర్ బీవీఎస్ రవి కామెంట్స్!

    |

    మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ 22 ఏళ్ల తర్వాత అన్నదమ్ముల్లుగా నటించి అదరగొట్టిన చిత్రం వాల్తేరు వీరయ్య. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి చిరు అభిమాని అయిన కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది.

    ఇప్పటికే ఈ చిత్రం రూ. 200 కోట్లకుపైగా వసూళ్లు సాధించి ఇంకా దూసుకుపోతోంది. వాల్తేరు వీరయ్య ఘన విజయం సాధించిన సందర్భంగా ఓరుగల్లులో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ ఈవెంట్ లో చిరుపై రచయిత బీవీఎస్ రవి షాకింగ్ కామెంట్స్ చేశారు.

    చిరు, రవితేజ కాంబినేషన్..

    చిరు, రవితేజ కాంబినేషన్..

    మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రంగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మాస్ మహారాజా రవితేజ అలరించాడు. సుమారు 22 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించి అదరగొట్టారని టాక్ వినిపిస్తోంది. ఇక దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం హైలెట్ గా నిలిచిందని అంటున్నారు.

    పొలిటిషీయన్స్ తోపాటు..

    పొలిటిషీయన్స్ తోపాటు..

    ప్రస్తుతం వాల్తేరు వీరయ్య విజయాన్ని చిత్రబృందం ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శనివారం వీరయ్య విజయ విహారం పేరుతో సక్సెస్ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వరంగల్ హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రాత్రి నిర్వహించారు. యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేసిన ఈ వేడుకకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ తో పాటు ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. అలాగే వాల్తేరు వీరయ్య సినిమా టీమ్ కూడా పాల్గొంది.

    ఇది మెగా సముద్రం..

    ఇది మెగా సముద్రం..

    ఈ వాల్తేరు వీరయ్య విజయోత్సవ వేడుకకు రచయితలు కోన వెంకట్, చక్రవర్తితోపాటు రైటర్, దర్శకుడు బీవీఎస్ రవి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమ మనసులోని భావాలను ఈ వేదికగా పంచుకున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి ఉన్న పలు చెడు అలవాట్ల గురించి షాకింగ్ బయట పెట్టాడు రైటర్ బీవీఎస్ రవి. "ఇది మెగా సముద్రం.. పూనకాలు ఫుల్లీ లోడింగ్ సముద్రం ఇది" అంటూ స్పీచ్ స్టార్ట్ చేశారు బీవీఎస్ రవి.

    తొడగొట్టి శిఖరం మీద కూర్చున్నా..

    తొడగొట్టి శిఖరం మీద కూర్చున్నా..

    "సముద్రానికి సునామీ వచ్చినట్లు అనిపిస్తోంది ఇక్కడ. ఈ అభిమానులు కట్టలు తెంచుకుని వస్తున్నారు. చాలా మందికి ఈ విజయం ద్వారా తెలియాల్సినవి కొన్ని ఉన్నాయి. కొందరికి ఒకటి, రెండు, మూడు, పది హిట్లు వస్తే.. నేల నుంచి కిలోమీటరు పైన నిలబడి డ్యాన్స్ చేస్తుంటారు అందరు. కానీ ఇన్ని హిట్లు, ఇండస్ట్రీ హిట్లు, సంవత్సారానికి ఓసారి తొడగొట్టి శిఖరం మీద కూర్చున్నా మెగాస్టార్ రెమ్యునరేషన్ ను లాకర్లు పెట్టుకుంటారో తెలియదు గానీ, ఆయన స్టార్ డమ్ ను మాత్రం లాకర్లు పెట్టుకుని ఒక మనిషిగా ఉంటారు" అని బీవీఎస్ రవి తెలిపారు.

    తపస్సు చేస్తే..

    తపస్సు చేస్తే..

    "అన్నయ్య నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంటుంది. అది మీరేనా కాదా అని. ఇంత టెక్నికల్ నాలేడ్డ్ ఉండి ఒక సామాన్యుడిలా మాట్లాడుతుంటే డౌట్ వస్తుంది. అది మీరేనా లేకా ఇంకెవరినైనా కూర్చోబెట్టారా అని. అభిలాష, ఛాలేంజ్, యముడికి మొగుడు వంటి హిట్స్ ఇచ్చి మెగాస్టార్ అయిన చిరంజీవి ఒక మాములు మనిషిగా ఉంటారు. అంత నేల మీద ఉండటం తపస్సు చేస్తే వస్తుంది. నిజం తెలుసుకుంటే వస్తుంది. నిలకడగా ఉంటే వస్తుంది. మెగా పవర్ స్టార్ ను కని, పక్కన పవర్ స్టార్ ను ఉంచుకుని అలా సాదాసీదాగా ఉండటం ఇట్స్ నాట్ ఏ జోక్ బ్రదర్" అని బీవీఎస్ రవి అన్నారు.

    చెడు అలవాట్లు తెలుసుకోవాలి..

    "అభిమానులారా.. మన మెగాస్టార్ కి ఎన్నో మంచి అలవాట్లతోపాటు కొన్ని చెడు అలవాట్లు కూడా ఉన్నాయి. అవి మనం తెలుసుకోవాలి. అవేంటో తెలుసా.. ఎంతమంది ఎన్ని మాటలు అన్నా నిశబ్ధంగా ఉండటం. ఎంతకోపం వచ్చిన చిరునవ్వుతో ఉండటం. ఎంత అభిమానం ఉన్నా.. ఎంత ప్రేమ ఉన్నా సరే.. నిబ్బరంగా, నిలకడగా ఉండటం. అది ఎవరి తరం కాదు. కేవలం మెగాస్టార్ వల్ల అవుతుంది అని చెప్పుకొచ్చారు" రైటర్ బీవీఎస్ రవి

    English summary
    Chiranjeevi Ravi Teja Waltair Veerayya Movie Success Meet At Hanamkonda Arts College Ground And Writer BVS Ravi Speech.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X