Waltair Veerayya: తండ్రి 48 గంటల్లో చనిపోతారన్న కూడా షూటింగ్ చేశాడు.. రైటర్ షాకింగ్ కామెంట్స్!
మెగా స్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న మాస్ మసాలా మూవీ ఇది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మరో కీలక పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నాడు. సుమారు 22 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు కెఎస్ రవీంద్ర అలియాస్ బాబీ. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. సంక్రాంతి బరిలోకి దిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 8న అంటే ఆదివారం విశాఖపట్నంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలో రైటర్ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్ చేశారు.

మైత్రీ మూవీ నిర్మాణంలో..
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో మంచి టాక్ అందుకున్న ఆయన మరో చిత్రంతో అభిమానులను, ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నారు. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో మెగాస్టార్ నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంక్రాంతి కానుకగా..
వాల్తేరు వీరయ్యగా మరోసారి మాస్ అవతారంతో మెస్మరైజ్ చేసేందుకు మెగాస్టార్ చిరు రెడీగా ఉండగా.. ఏసీపీ విక్రమ్ సాగర్ గా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మాస్ మహారాజా రవితేజ అలరించనున్నాడు. సుమారు 22 ఏళ్ల తర్వాత చిరంజీవి-రవితేజ కలిసి నటించిన ఈ వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ చిత్రంపై అభిమానులు భారీగానే హోప్స్ పెట్టుకున్నారు.

విపరీతమైన క్రేజ్..
మెగా అభిమానులు, రవితేజ ఫ్యాన్స్ అంచనాలకు తగినట్లుగానే వాల్తేరు వీరయ్యను పక్కా మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బాసు పార్టీ స్పెషల్ నంబర్ ను, నువ్వు శ్రీదేవి-నేను చిరంజీవి అనే మెలోడీ సాంగ్ ను, వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ తోపాటు పూనకాలు లోడింగ్ పాటలను ఇటీవల విడుదల చేయగా వాటికి విపరీతమైన క్రేజ్ వచ్చింది.

హోస్ట్ గా యాంకర్ సుమ..
జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల కానున్న చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 8న అంటే ఇవాళ విశాఖలో నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేదిక ఆఖరుకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో ఫిక్స్ అయింది. ఈ వేడుకను స్టార్ యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేస్తుండగా.. చిరంజీవి, రవితేజ, డైరెక్టర్ బాబీ, నిర్మాతలు, రైటర్స్ హాజరయ్యారు.

చిరుకి డై హార్డ్ ఫ్యాన్ ని..
వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రైటర్ లో ఒకరైన చక్రవర్తి.. దర్శకుడు బాబీ గురించి ఆశ్చర్యకర విషయాలు చెప్పుకొచ్చాడు. "నేను మెగాస్టార్ చిరంజీవికి డై హార్డ్ ఫ్యాన్ ని. ఆయన సినిమా కోసం లాఠీ దెబ్బలు తిన్నవాళ్లలో నేను ఒకన్ని. అలాంటిది ఆయన సినిమాకు నేను ఒక రైటర్ గా పనిచేయాల్సి వచ్చినందుకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు, డైరెక్టర్ కి కృతజ్ఞతలు" అని తెలిపారు.

48 గంటలు మాత్రమే ఉందన్న కూడా..
"ఈ ప్రపంచంలో రెండు విషయాలు అస్సలు తగ్గవు. ఒకటి ల్యాండ్ ధర అయితే. ఇంకొకటి మన మాస్ మహారాజా రవితేజ ఎనర్జీ. ఈ రెండు పెరగడాలే తప్ప తగ్గడాలు ఉండవు. ఈ సినిమాకు మా బావ బాబీ కమిట్ మెంట్ ఏ లెవెల్ లో ఉందంటే.. ఈ చిత్రం షూటింగ్ సమయంలో వాళ్ల నాన్న గారు ఆస్పత్రి పాలయ్యారు. ఇంకో 48 గంటలు మాత్రమే బతుకుతారని డాక్టర్స్ చెప్పారు. అలాంటప్పుడు కూడా బాధను దిగమింగుకుని షూటింగ్ కు వెళ్లాడు. హ్యాట్సాఫ్ టు యూ బావ" అని రైటర్ చక్రవర్తి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











