twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తారాచౌదరీ నన్ను వాడుకొన్నది.. అన్నీ అవాస్తవాలే.. అంతా టీవీ ఛానల్ వల్లే.. చిన్నికృష్ణ

    By Rajababu
    |

    టాలీవుడ్‌లో రచయితలకు స్టార్ హోదా కల్పించినవారిలో రైటర్ చిన్నికృష్ణ ప్రముఖుడు అని చెప్పవచ్చు. నందమూరి బాలకృష్ణji ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన చిత్రాన్ని అందించాడు. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో చిరంజీవికి ఇంద్ర లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాను అందించారు. అలాంటి చిన్నికృష్ణ తెలుగు, తమిళ పరిశ్రమలకు ఘన విజయాలను అందించాడు. కానీ ఆ తర్వాత చిన్నికృష్ణ అనేక వివాదాల్లో కూరుకుపోయాడు. ఇటీవల ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించారు. చిన్నికృష్ణ వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే..

     తీసిన సినిమాలన్నీ సక్సెస్‌లే

    తీసిన సినిమాలన్నీ సక్సెస్‌లే

    నేను తీసిన సినిమాలు ఏవీ ఫెయిల్ కాలేదు. సీమసింహం ఫెయిల్ అయిందంటే అందులో నా పాత్ర లేదు. నేను ఇచ్చిన కథను చాలా మంది కెలికి కథలో అనేక మార్పులు చేశారు. ఇప్పటికీ నా కథలో ఎవరైనా వేలు పెడితే నేను ఒప్పుకొను. అందుకే సీమ సింహం సినిమాకు నా పేరు వేయవద్దని రాతపూర్వకమైన లేఖను ఇచ్చాను.

     బద్రీనాథ్ ఫ్లాప్ కాదు

    బద్రీనాథ్ ఫ్లాప్ కాదు

    బద్రీనాథ్ సినిమా ఫెయిల్ అంటే నేను ఒప్పుకోను. టెలివిజన్ చానెల్లో కొంత ప్రచారం జరిగింది. బ్రదీనాథ్ సినిమాకు ముందు అల్లు అర్జున్‌కు ఆర్య2, వరుడు, వేదం మూడు సినిమాలు బాక్సాపీస్ వద్ద దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.

     అల్లు అర్జున్ రేంజ్‌ను మించి

    అల్లు అర్జున్ రేంజ్‌ను మించి

    అల్లు అర్జున్‌కు 20 కోట్ల మార్కెట్ రేంజ్ ఉంది. కానీ బద్రీనాథ్ చిత్రం 35 కోట్లకుపైగా బడ్జెట్‌తో రూపొందింది. అంత భారీ ఎత్తున ఖర్చు పెట్టడం ఆ సినిమాకు అవసరం లేదు. అయినా అల్లు అర్జున్ సినిమాకు సంబంధించి గుంటూరులో ఈ చిత్రం 1.50 కోట్లు వసూలు చేసే రికార్డు ఉంటే.. బద్రీనాథ్ చిత్రం 3.5 కోట్లు వసూలు చేసింది. ఈ లెక్కలను బట్టైనా ఫ్లాప్ అనడం సరికాదు.

     ఆ మాట చిరంజీవే చెప్పాడు..

    ఆ మాట చిరంజీవే చెప్పాడు..

    సినిమా విజయం వెనుక మూడు కారణాలు ఉంటాయి ప్రపంచ సినిమా చెబుతున్నది. వాటిలో ఒకటి స్క్రిప్టు.. రెండోది స్క్రిప్టు. మూడోది స్క్రిప్టు. ఇంద్ర 175 రోజుల ఫంక్షన్ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. ఈ సినిమా విజయంలో నాది, గోపాల్, తదితరులది 50 శాతం పాత్ర అయితే.. చిన్నిక‌ష్ణది 50 శాతం పాత్ర అని అన్నారనే విషయాన్ని గుర్తు చేశాడు.

     తారా చౌదరీ ఆరోపణలపై

    తారా చౌదరీ ఆరోపణలపై

    తారా చౌదరీ నాపై చేసిన విమర్శలు, ఆరోపణల్లో వాస్తవం లేదు. ఆమెతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. మానసిక, శారీరక, ఆర్థిక సంబంధాలు మా మధ్య లేదు. ఆమె తెలిసి తెలియక నాపై ఆరోపణల చేసింది. నా పేరును వాడుకొని ఏదో సాధించాలని చూసింది. ఏదో రోజు ఆమె రియలైజ్ అయితే అంతకంటే నాకు సంతోషం ఏమీ ఉండదు.

    తారా చౌదరితో సంబంధాలు లేవు

    తారా చౌదరితో సంబంధాలు లేవు

    తారా చౌదరీ వివాదంలో నాకు ఎలాంటి సంబంధం లేదు అని ప్రతీఒక్కరికి తెలుసు. ఓ మీడియా నాపై పనిగట్టుకు దుష్ఫ్రచారం చేసింది. రేటింగ్ కోసం ఆ చానెల్ నాపై కథనాలు వెల్లడించింది. సదరు చానెల్‌కు సంబంధించిన వ్యక్తే నాకు ఈ విషయం చెప్పారు.

     అగ్రనటులతో పనిచేశాను..

    అగ్రనటులతో పనిచేశాను..

    తెలుగు సినిమా పరిశ్రమకు నరసింహనాయుడు, ఇంద్ర లాంటి ఐదు హిట్లు ఇచ్చాను. తమిళ పరిశ్రమకు మూడు సూపర్‌హిట్లు అందించాను. తెలుగు బాలకృష్ణ, చిరంజీవి, తమిళంలో శరత్ కుమార్ లాంటి అగ్ర నటులతో పనిచేశాను.

     భాగ్యరాజా నా గురువు

    భాగ్యరాజా నా గురువు

    నేను భాగ్యరాజా సినిమా చూసి సినీ రంగంలో ప్రవేశించాలని అనుకొన్నాను. ఆయనతో చాలా సినిమాలకు పనిచేశాను. ఆయన నాకు మంచి గురువు. ఆయనకు ఉన్న చాలా మంది శిష్యుల్లో నన్ను టాప్ అని భాగ్యరాజా చెప్పారు.

    రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో

    రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో


    సినీ పరిశ్రమలో అప్పుడప్పుడూ పనిచేస్తూనే ఉన్నాను. నాకు వేరే వ్యాపారాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిజీగా ఉన్నాను. రియల్ ఎస్టేట్‌లో ఎన్ని డబ్బులు సంపాదించినా నాకు సినిమా పరిశ్రమనే ఇష్టం.

     త్రివిక్రమ్ అంటే

    త్రివిక్రమ్ అంటే

    రైటర్లు చాలా మంది దర్శకులుగా మారిపోతున్నారు. రచయిత నుంచి దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇష్టం. మిర్చి సినిమా తీసిన కొరటాల శివ కూడా ఇష్టం. రచయితలు డైరెక్టర్ మారడం శుభ పరిమాణం.

     సూర్య కోసం కథ రాశా

    సూర్య కోసం కథ రాశా

    ప్రస్తుతం తమిళ నటుడు సూర్య కోసం ఓ కథ రాశాను. ఆయన విని ఓకే చెబితే నా ఫేట్ మారిపోతుంది. శంకర్ స్థాయిలో కథ రాశాను. భారీ స్థాయిలో తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాను. అదే కనుక తెరరూపం దాల్చితే ప్రతీ ఒక్కరు ప్రశంసించడం ఖాయం. ఆ క్షణాల కోసం ఎదురుచూస్తున్నాను. నాకు డైరెక్టర్ కావడమే నా ఏకైక ధ్యేయం అని అన్నారు.

    English summary
    Writer Chinni Krishna is famous in Tollywood and Kollywood. He has given blackbuster movies for top heroes. After many success, he become star writer of the film industry. Recently he spoke to media and revealed some contraversial issues behind the scene.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X