అల్లు అరవింద్ నిర్మాతగా రైటర్ చిన్నికృష్ణ దర్శకుడుగా...
గంగోత్రి, నరసింహనాయుడు, ఇంద్ర వంటి సూపర్ హిట్ చిత్రాలుకు రచన చేసిన చిన్నికృష్ణ దర్శకుడిగా త్వరలోనే అవతారమెత్తే సూచనలు కనపడుతున్నాయి. నిన్న బుధవారం జరిగిన 'జీనియస్' వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడుతూ...సూచన ప్రాయంగా దీని హింట్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అరవింద్ మాట్లాడుతూ "మా అబ్బాయి అల్లు అర్జున్ ని కథానాయకుడిగా చూడాలని ఆశపడిన వాళ్లలో చిన్నికృష్ణ ఒకరు. 'గంగోత్రి'తో బన్నీకి మంచి కథ అందించాడు. ఇప్పుడు 'బధ్రీనాథ్' చిత్రానికీ అతనే రచయిత. చిన్ని ఎప్పుడైనా దర్శకుడిగా మారితే ఆ సినిమా గీతా ఆర్ట్స్‌లోనే ఉంటుంది. మా ఇద్దరి మధ్య జరిగిన స్నేహపూర్వక ఒప్పందం ఇది" అన్నారు. చిన్ని కృష్ణ రైటర్ లా ఎలా హిట్స్ ఇచ్చారో అలాగే దర్శకుడుగానూ సూపర్ హిట్స్ ఇవ్వాలని ధట్స్ తెలుగు కోరుకుంటోంది.
బద్రీనాధ్ అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ గంగోత్రి నరసింహనాయుడు ఇంద్ర చిన్ని కృష్ణ allu aravind geetha arts gangotri narasimha naidu chinni krishna


Click it and Unblock the Notifications