twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దర్శకుడుగా మారబోతున్నా: చిన్ని కృష్ణ

    By Srikanya
    |

    Writer Chinni Krishna celebrating his Birthday
    హైదరాబాద్: ''నిజానికి దర్శకత్వం చేయాలనే పరిశ్రమలోకి అడుగుపెట్టాను. కానీ దైవానుగ్రహం మేరకు తొలుత రచయితగా మారాను. ఈ యేడాది మాత్రం తప్పనిసరిగా మెగాఫోన్‌ పట్టబోతున్నాను. ఓ ప్రముఖ హీరోతోనే ఆ సినిమా ఉంటుంది'' అన్నారు ప్రముఖ రచయిత చిన్ని కృష్ణ. నరసింహనాయుడు, నరసింహ, ఇంద్ర, గంగోత్రి వంటి విజయవంతమైన చిత్రాలకు రచన చేసిన చిన్నికృష్ణ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు.

    అలాగే రచయితగా ప్రయాణం మొదలుపెట్టి పన్నెండేళ్లయింది. రాసింది తక్కువ సినిమాలకే అయినా... మంచి సినిమాలను అందించానన్న తృప్తి ఉంది. నా దగ్గర చాలానే కథలున్నాయి. అయితే నేను కొద్దిమందికే అర్థమవుతుంటాను, నన్ను పూర్తిగా అర్థం చేసుకొన్నవాళ్లతోనే పనిచేశాను. నేను తక్కువ సినిమాలు చేయడానికి కారణం అదే. కెరీర్ తొలినాళ్లలో రచయితగా మంచి కథలు సిద్ధం చేసుకుని 'నరసింహ నాయుడు' సినిమా కోసం మూడేళ్లు ఎదురుచూశాను.

    నేననుకున్నదానికోసం వెయిట్ చేయడం కూడా నాకు ఆనందమే. ఇప్పుడు దర్శకత్వం కూడా అలాంటిదే. నన్ను, నాకథను అర్థం చేసుకునే హీరో, నిర్మాత కోసం ఇన్నాళ్లు అన్వేషించాను. త్వరలో అలాంటి కాంబినేషన్ సెట్ కాబోతుంది. నా దర్శకత్వ కోరిక ఈ సంవత్సరం ఖచ్చితంగా తీరుతుందనే నమ్మకం వుంది. ప్రస్తుతం నా దగ్గర పది స్క్రిప్టులు సిద్ధంగా వున్నాయి. అందులో అయిదు కథలు బయటి దర్శకులకు ఇస్తాను. మిగతా అయిదు స్క్రిప్టులు నా డైరెక్షన్‌లోనే తెరకెక్కుతాయి. సూర్య, పవన్‌కల్యాణ్, మహేష్, ఎన్టీఆర్, బన్నీ లాంటి యువ హీరోల చిత్రాలకు దర్శకత్వం చేయాలని వుంది.

    'చిరంజీవిగారి 150వ చిత్రం కోసం ఓ మంచికథను సిద్ధం చేస్తున్నాను. అలాగే తమిళ నటుడు సూర్యతో పాటు బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాను. ఇందుకోసం నాలుగేళ్లుగా కృషి చేస్తున్నాను. ఈ విషయమై తరచుగా ముంబై వెళ్లి వస్తున్నా' అని చెప్పారు రచయిత చిన్నికృష్ణ. ఇంతకు ముందు నేను రచన అందించిన చిత్రాలకు సీక్వెల్స్ చేయాలనే ఆలోచన లేదు. ఎప్పటికప్పుడూ కొత్త కాన్సెప్ట్‌లతో కథలను తయారుచేయాలనేది నా అభిమతం. ప్రతి ఏడాది విజయవంతమవుతున్న సినిమాలను చూసి రచయితగా అప్‌డేట్ అవుతున్నాను.

    చార్లీ చాపిన్, రాజ్‌కపూర్, భాగ్యరాజా, సుజాత వంటి గొప్ప రచయితల ప్రభావం నాపై చాలా వుంది. ఇక దర్శకుడిగా, రచయితగా మణిరత్నం, శంకర్ అంటే నాకు చాలా ఇష్టం. భవిష్యత్‌లో నేను దర్శకత్వం వహించబోయే సినిమాను వాళ్లను మెప్పించే స్థాయిలో తెరకెక్కించాలనేది నా కోరిక. మన పరిశ్రమలో రచయితల కొరత వుంది అని ఎవరైనా అంటే నేను ఒప్పుకోను. నా దృష్టిలో సినిమా విజయానికి, అపజయానికి కారణం హీరోలు కాదు. కేవలం రచయితలు మాత్రమే. దర్శకత్వం అంటే ఇప్పుడు ఎగ్జిక్యూషన్‌గా మారింది అన్నారు.

    English summary
    
 Chinni Krishna made his debut as a writer with the Narasimha Naidu film. Later, he penned stories for Indra, Gangotri and Badrinath. The successful writer, who is celebrating his birthday on Sunday, spoke to the media on Saturday. He said, "I accept few assignments. Number doesn't matter. I always try to come up with good stories that would bring profits to the makers."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X