ఎక్కడ చూసినా రైటర్ చిన్నికృష్ణ ఆత్మహత్య’ టాపిక్కే!!

By Srikanya

నాలుగు రోజుల క్రితం 'చిన్నికృష్ణ ఆత్మహత్య" అంటూ ఓ పాపులర్ టీవీ చానల్‌లో ప్రసారమైన సంగతి తెలిసిందే.ఆ వార్త ఎవరకీ పెద్ద తెలియకపోయినా ఆ తర్వాత చిన్ని కృష్ణ 'నేను బతికే ఉన్నాను" అంటూ ఆయన టివి చానల్స్‌కు, పత్రికా కార్యాలయాలకు ఫోన్లు చేసి చెప్పటంతో ఆ విషయం హైలెట్ అయి అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఆ సంఘటన విశేషాలు ఇలా ఉన్నాయి.'చిన్నికృష్ణ పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు" అనే స్క్రోలింగ్‌ వార్తను ఓ టీవీ ఛానెల్ లో ప్రసారం చేసింది. దానకి కారణం హైద్రాబాద్‌ శివార్లలో చిన్నికృష్ణ అనే సబ్‌ ఇన్సెపెక్టర్‌ వ్యక్తిగత కారణాల వల్ల పిస్టర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వార్త ఓ చానల్‌లో ప్రసారమైంది. అదే వారు ప్రసారం చేసారు. అయితే ఆ వార్తను పూర్తిగా చూడకుండానే కొంతమంది ఎంక్వైరీలు స్టార్ట్‌ చేసారు. రచయిత చిన్నికృష్ణకు సన్నిహితులైనవారు ఈ వార్త తెలియగానే ఆయనకు ఫోన్‌ చేసారు. అయితే.. ఆ సమయానికి ఆయన తన సెల్‌ఫోన్‌ను సైలెంట్‌ మోడ్‌లో పెట్టి 'తీన్‌మార్‌" సినిమా చూస్తున్నారు. ఎవరు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా చిన్నికృష్ణ స్పందించకపోవడం సహజంగానే మరింత గందరగోళానికి దారితీసింది. చివరికి ఈ వార్త చిన్నికృష్ణను కూడా చేరి.. 'నేను బతికే ఉన్నాను" అంటూ ఆయన టివి చానల్స్‌కు, పత్రికా కార్యాలయాలకు ఫోన్లు చేయాల్సి వచ్చింది. అదీ సంగతి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X