బోయపాటి శ్రీను ఒక మూర్ఱమైన డైరెక్టర్ అంటూ రచయిత సంచలనం!
వైసీపీ, జగన్ మద్దతుదారుడైన తెలుగు సినీ రచయిత చిన్ని కృష్ణ ఇటీవల ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు, తెలుగు దేశం అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా చిన్ని కృష్ణ.. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుపై సంచలన కామెంట్స్ చేశారు. బోయపాటి శ్రీను అనే వ్యక్తి దుబాన్ కోరు డైరెక్టర్.. నిన్నగాక మొన్న ఓ సినిమా తీశాడు. విలన్ తలకాయలను హీరో నరికితే వాటిని గాల్లోనే గద్దలు ఎగరేసుకెళతాయట. అలాంటి సినిమాలు తీసే ఒక మూర్ఱుడు, అజ్ఞాని, ఏమీ తెలియని, పశువుకంటే హీనమైన ఆ డైరెక్టర్‌తో చంద్రబాబు నాయుడు పుష్కరాల ఏర్పాట్లు చేయించి ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కారణం అయ్యారని విమర్శించారు.

చిరంజీవికి 'ఇంద్ర' లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన రచయితను నేను. అలాంటి నాకు ఏనాడైనా ఇస్తరి వేసి భోజనం పెట్టిన కుటుంబమా మీది? అంటూ... పవన్ కళ్యాణ్ మీద విమర్శలు గుప్పించారు. చిన్ని కృష్ణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో ఆంధ్రా సెటిలర్లపై దాడులు చేస్తున్నారని, భూకబ్జాలకు పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా చిన్ని కృష్ణ తప్పుపట్టారు. మీ రాజకీయాల కోసం విద్వేషాలు రెచ్చగొట్టవద్దని సూచించారు.


Click it and Unblock the Notifications











