మీ అన్నలు కాపాడుతారా? నోరు తెరిస్తే నవరంధ్రాలు మూసుకోవాలి..పవన్‌, చిరు, నాగబాబుపై చిన్నికృష్ణ ఆగ్రహం

Recommended Video

Chinnikrishna Sensational Comments On Pawan kalyan | Filmibeat Telugu

తెలంగాణలో శాంతియుతంగా జీవిస్తున్న సెటిలర్ల జీవితాలతో ఆడుకోవద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ ప్రముఖుడు చిన్నికృష్ణ మండిపడ్డారు. తెలంగాణలో ఆంధ్రా సెటిలర్లపై దాడులు చేస్తున్నారని, భూకబ్జాలకు పాల్పడుతున్నారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలను చిన్ని కృష్ణ తప్పుపట్టారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా ప్రెస్‌మీట్‌లో చిన్ని కృష్ణ మాట్లాడుతూ..

 స్వేచ్ఛగా బతుకుతున్నామని

స్వేచ్ఛగా బతుకుతున్నామని

తెలంగాణ ప్రాంతంలో నా కుటుంబం స్వేచ్చగా బతుకుతున్నది. ఈ ప్రాంతం కుటుంబాలతో నేను వియ్యం అందుకొన్నాను. రెండు ప్రాంతాల ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. అలాంటి సమయంలో మీరెందుకు చిచ్చు పెడుతున్నారు అని చిన్ని కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కడుపులో పెట్టుకొని చూసుకొంటున్నారని

కడుపులో పెట్టుకొని చూసుకొంటున్నారని

దేశంలోనే ఉత్తమ రాజకీయ నేతగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారు. ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. ఆయన తర్వాత కేటీఆర్ సీఎం అవుతారు. కేసీఆర్ కుటుంబం అన్ని ప్రాంతాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకొంటున్నారు. మీ రాజకీయాల వల్ల ఆంధ్రా ప్రాంతమంటే మాకు ఒకరకమైన ప్రతికూల భావం ఏర్పడుతున్నది అని చిన్ని కృష్ణ అన్నారు.

 మీపై సెటిలర్ల ఆగ్రహం

మీపై సెటిలర్ల ఆగ్రహం

మీరు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో సెటిలర్లందరూ షాక్‌కు గురవుతున్నారని పవన్‌పై చిన్నికృష్ణ ఫైర్ అయ్యారు. మేము పిలుపునిస్తే ఆంధ్రా ప్రాంత సెటిలర్లందరూ మీకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు అని ఆయన హెచ్చరించారు.

 రాజకీయాల కోసం రాష్ట్రాలను విడగొట్టొద్దు

రాజకీయాల కోసం రాష్ట్రాలను విడగొట్టొద్దు

మీ రాజకీయాలతో రాష్ట్రాలను విడగొట్టొదు. తెలంగాణ పోలీసులపై నమ్మకం లేదని చంద్రబాబు, ఇంకో వ్యవస్థపై నమ్మకం లేదని పవన్ కల్యాణ్ అనడం తప్పు. ఒకవేళ సెటిలర్లకు ఇక్కడ ఏదైనా సమస్య వస్తే ఎవరు కాపాడుతారు? మీ అన్న నాగబాబు కాపాడుతారా? సైరా తీస్తూ మేకప్ వేసుకొన్న చిరంజీవి ఆదుకొంటారా అని చిన్ని కృష్ణ తీవ్రంగా స్పందించారు.

నోరు తెరిస్తే నవరంధ్రాలు మూసుకొంటారని

నోరు తెరిస్తే నవరంధ్రాలు మూసుకొంటారని

తెలంగాణ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శలు చేయడం ముమ్మాటికి తప్పని చిన్నికృష్ణ అన్నారు. మీరు సాధించిన విజయాలేంటి? ఎన్నికల తర్వాత నేను నోరు తెరిస్తే నవరంధ్రాలు మూసుకోవాల్సి వస్తుంది అని పవన్ కల్యాణ్‌ను చిన్నికృష్ణ హెచ్చరించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X