»   » తెలుగు దర్శకుడు రాజసింహ ఆత్మహత్యాయత్నం

తెలుగు దర్శకుడు రాజసింహ ఆత్మహత్యాయత్నం

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఆత్మహత్య యత్నానికి పాల్పడిన దర్శకుడు రాజహంస

తెలుగు రచయిత, దర్శకుడు రాజసింహ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ముంబైలో ఉన్న ఆయన డిప్రెషన్‌ కారణంగా నిద్రమాత్రలు మింగినట్లు తెలుస్తోంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను వెంటనే సన్నిహితులు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సరైన అవకాశాలు లేక, కెరీర్ అనుకున్న విధంగా సాగక సంవత్సర కాలంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న ఆయన ఈ చర్యకు పాల్పడ్డట్లు సమాచారం.

తెలుగు హిట్ మూవీ బొమ్మరిల్లుతో పాటు బోని, కాళిదాసు, రుద్రమదేవి సినిమాలకు రాజసింహ రచయితగా పని చేశారు. దర్శకుడు కావాలనే తన కలను నిజం చేసుకుంటూ 'ఒక అమ్మాయి తప్ప' అనే సినిమా ద్వారా తెరంగ్రేటం చేశారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్, నిత్యా మీనన్ హీరో హీరోయిన్లుగా నటించారు.

Writer and director Rajasimha tried to commit suicide

2016లో విడుదలైన 'ఒక అమ్మాయి తప్ప' మూవీ బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు. దీంతో రాజసింహకు అవకాశాలు తగ్గిపోయాయి. దాదాపు సంవత్సర కాలంగా కెరీర్ పరమైన అంశాలతో డిప్రెషన్లో ఉన్న ఆయన ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్లు సమాచారం.

English summary
Writer and director Rajasimha tried to commit suicide in Mumbai. He was in depression for more than a year because of Career oriented issues and other pressures.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X