»   » స్టార్ డైరెక్టర్స్, హీరోలపై విమర్శలపై....కౌంటర్ (వీడియో)

స్టార్ డైరెక్టర్స్, హీరోలపై విమర్శలపై....కౌంటర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమాల్లో హీరోయిన్లు కొన్ని సీన్లలో నీచంగా చూపిస్తున్నారు, హీరోయిన్ల బట్టలు బలవంతంగా విప్పే సన్నివేశాలను హీరోయిజంలా చూపిస్తున్నారు. పెద్ద వాళ్లను కొట్టే సన్నివేశాలతో కామెడీ చేస్తున్నారు. ఇలాంటి సన్నివేశాలతో మన తెలుగు సినిమా దర్శకులు సమాజానికి, యువతరానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ ఓ సగటు మహిళ సోషల్ మీడియా వేదికగా తెలుగు స్టార్ డైరెక్టర్లు రాజమౌళి, త్రివిక్రమ్, ఇతర దర్శకులపైనా....అలాంటి సీన్లలో నటిస్తున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇతర లాంటి వారిపైనా విమర్శనాస్త్రాలు గుప్పించింది.

Writer gives strong reply to Annapurna Sunkara!

సినిమాల్లో హీరోయిన్లకు జరిగినట్లు నిజ జీవితంలో మీ తల్లికో, చెల్లికో జరిగితే మీరు ఎలా సహిస్తారు. ఇంట్లో పిల్లలు తమ కంటే వయసులో పెద్దవాళ్లను కొడితే సహిస్తారు. సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు పెడితే అది క్రమ క్రమంగా మన జీవితాల్లోకి కూడా ప్రవేశిస్తాయి. కేవలం సినిమా వాళ్లపైనే కాదు...ఇలాంటి సీన్లను తప్ప బట్టకుండా ఉంటున్న సామాన్య ప్రేక్షకులపైనా ఆమె విమర్శలు గుప్పించారు.

అయితే ఆమె విమర్శలకు ఓ రైటర్ కౌటర్ ఇచ్చారు...ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

English summary
Tollywood writer gives strong reply to Annapurna Sunkara!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu