రాజమౌళితో చేసాక సునీల్ నెక్ట్స్ ఆ దర్శకుడుతో...
రాజమౌళి, సునీల్ కాంబినేషన్లో మర్యాద రామన్న అనే కామిడీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం అనంతరం సునీల్ కు మంచి డిమాండ్ ఏర్పడుతుందని అంచనా. దాంతో అప్పుడే సునీల్ హీరోగా చేసే నెక్ట్స్ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. అయితే ఆ సినిమాను రెగ్యులర్ దర్శకుడు చేయటం లేదు. అనేక చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే అందించిన రచయిత గోపీ మోహన్ డైరక్ట్ చేయనున్నాడు. అంతకుముందు గోపీ మోహన్ చేసిన ఢీ కన్నా మంచి స్క్రిప్టు ఉందని, అది విన్న త్రివిక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే సునీల్ పచ్చ జెండా ఊపాడని చెప్తున్నారు. ఇక ఈ సినిమాను కూడా మర్యాద రామన్న నిర్మాతలే తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఈ మేరకు టాక్స్ జరుగుతున్నాయని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక సునీల్ ఇంతకు ముందు అందాల రాముడు చిత్రంలో హీరోగా చేసారు. అనంతరం ఎన్ని ఆఫర్స్ వచ్చినా హీరోగా చేయకుండా రాజమౌళి కాంబినేషన్ కోసం ఎదురుచూసారు. ఇక గోపీ మోహన్ గతంలో తేజ వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసారు.


Click it and Unblock the Notifications











