twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కీచక' చిత్రం గురించి రైటర్ గోపీ మోహన్ ఇలా....

    By Srikanya
    |

    హైదరాబాద్ : యామినీ భాస్కర్‌, జ్వాలాకోటీ, రఘుబాబు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'కీచక'. యన్‌.వి.బి.చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రాన్ని రీసెంట్ గా రచయిత గోపీ మోహన్ చూసారు. ఆయన ఈ సినిమా గురించి ఈ క్రింద విధంగా ఫేస్ బుక్ లో స్పందించారు. ఆయన ఏమన్నారో క్రింద చూడండి.

    మా మిత్రులు,Screenplay చౌదరి గారు(మిణుగురులు రచయిత) తీసిన "కీచక" - మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం theatres లో ఆడుతోంది.హీరోయిన...

    Posted by Gopi Mohan on 31 October 2015

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల్ని అరికట్టే క్రమంలో ఓ యువతికి ఎదురైన సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం. మహిళల్లో చైతన్యాన్ని కలిగించే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ఆస్కార్ నామినేటెడ్ మిణుగురులు కథారచయిత ఎస్‌వీబీ చౌదరి దర్శకత్వ ప్రతిభ చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుంది.

    దర్శకుడు మాట్లాడుతూ ''నాగ్‌పుర్‌లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. నిర్భయలాంటి చట్టాలున్నా మహిళలపై అన్యాయాలు, అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిపై ఓ మహిళ చేసిన తిరుగుబాటు ఈ చిత్రం. ఆడదంటే అబల కాదు ఆదిపరాశక్తి అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నామ''న్నారు.

    Writer Gopi Mohan tweet about Keechaka movie

    ఆధునిక భారత దేశ చరిత్రలో అత్యంత దుర్మార్గులైన సైకో లలో ఒకడైన అక్కు యాదవ్ జీవిత గాధ ఆధారం గా నిర్మించ బడిన చిత్రం కీచక. అతని జీవితం అతనిలాంటి వాళ్లందరికీ ఒక గుణపాఠం గా మిగలాలి అన్న ఉద్దేశ్యం తో ఈ చిత్రాన్ని నిర్మించామని నిర్మాత తెలియజేశారు. అయితే అంతటి దుర్మార్గుడి కథ ను తెరకు ఎక్కిస్తున్న సందర్భం లో కొన్ని చోట్ల హార్ష్ గా, మరికొన్ని చోట్ల వయోలెంట్ గా ఉండక తప్పలేదని వారు అన్నారు.

    నిర్మాత మాట్లాడుతూ ...‘‘సమాజంలో స్ర్తీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఓ స్ర్తీ చేసిన పోరాటమే ఈ సినిమా. వాస్తవిక సంఘటనలకు అద్దం పట్టేలా దర్శకుడు తీర్చిదిద్దనున్నారు. '' అని తెలిపారు.

    జ్వాలా కోటి, యామినీ భాస్కర్‌, రఘబాబు, గిరిబాబు, వినోద్, నాయుడు, రోజా భారతి, బోసుబాబు, శ్రీహర్ష, ఝాన్సీ, మమత, వాసు ఇంటూరి, శివన్నారాయణ, రజిత తదితరులు . ఈ చిత్రానికి మాటలు: రాంప్రసాద్‌, సినిమాటోగ్రఫీ: కమలాకర్‌, సంగీతం: జోస్యభట్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మోహన్‌ రావిపాటి.

    English summary
    Writer Gopi Mohan write about Filmmaker NVB Chowdary’s dark crime thriller Keechaka in Face Book.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X