దర్శకుడిగా మారిన రచయిత హర్షవర్ధన్
హైదరాబాద్: నటుడిగా, రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ దర్శకుడి అవతారం ఎత్తబోతున్నారు. మలినేని ప్రొడక్షన్స్ ప్రై.లి పతాకంపై ప్రముఖ విద్యావేత్త మలినేని లక్ష్మయ్య చౌదరి నిర్మించనున్న చిత్రం ద్వారా హర్షవర్ధన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ప్రస్తుతం లక్ష్మయ్య చౌదరి కన్నడలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగులో విజయం సాధించిన ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ' చిత్రాన్ని ఆయన కన్నడలో రీమేక్ చేస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా త్వరలో ఆడియో విడుదల జరుపుకోనున్న ఈ కన్నడ చిత్రం అనంతరం...హర్షవర్ధన్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కానుంది.

మలినేని ప్రొడక్షన్స్ ప్రై.లి.పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా లక్ష్మయ్య చౌదరి నిర్మించే చిత్రానికి ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మనం చిత్రాలతో రైటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షవర్ధన్ దర్శకుడిగా కూడా తన టాలెంట్ నిరూపించుకుంటారనే నమ్మకం వ్యక్తం చేసారు లక్ష్మయ్య చౌదరి.


Click it and Unblock the Notifications











