»   » రామ్ గోపాల్ వర్మ మోసం: ‘ఆఫీసర్’ స్క్రిప్టు లీక్ చేసి జయకుమార్ సంచలనం!

రామ్ గోపాల్ వర్మ మోసం: ‘ఆఫీసర్’ స్క్రిప్టు లీక్ చేసి జయకుమార్ సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Ram Gopal Varma Officer Movie Script Leaked

    నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆఫీసర్' మూవీ స్క్రిప్టు తనదే అంటూ రచయిత జయకుమార్ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ తన స్క్రిప్టును కాపీ కొట్టి ఈ మూవీ తీశారని ఆయన ఆరోపించారు. తనకు జరిగిన మోసం గురించి హీరో నాగార్జునకు చెప్పి న్యాయం కోరడానికి ప్రయత్నించినా సాధ్యం కాక పోవడంతో చివరకు 'ఆఫీసర్' స్కిప్టు మొత్తాన్ని ఇంటర్నెట్లో పెట్టేసి సంచలన చర్యకు పాల్పడ్డాడు జయకుమార్.

    అన్ని దారులు మూసేశారు: జయకుమార్

    అన్ని దారులు మూసేశారు: జయకుమార్

    నాకు జరిగిన మోసం గురించి నాగార్జునగారికి చెప్పి న్యాయం కోరడానికి శతవిధాలా ప్రయత్నం చేశాను. కానీ కానీ నా స్క్రిప్టును కాపీ కొట్టిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి, అతడికి సపోర్ట్ చేసిన నిర్మాత దాకా అందరూ నా దారులన్నీ మూసేశారు... అని జయకుమార్ పేర్కొన్నారు.

     స్క్రిప్టు మొత్తం లీక్ చేసిన జయకుమార్

    స్క్రిప్టు మొత్తం లీక్ చేసిన జయకుమార్

    ‘ఆఫీసర్' పేరుతో తాను రాసుకున్న స్క్రిప్టు మొత్తాన్ని జయకుమార్ ఆన్‌లైన్లో లీక్ చేశారు. వర్మ తీసిన ‘ఆఫీసర్' మూవీతో స్క్రిప్టుతో ఇది ఏ మేరకు మ్యాచ్ అవుతుందో అంటూ అంతా ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

    23 పేజీల స్క్రిప్టు...

    23 పేజీల స్క్రిప్టు...

    మొత్తం 23 పేజీల్లో రాసిన పూర్తి స్క్రిప్టును జయకుమార్ విడుదల చేశారు. ఇందులో ప్రతి పాత్రకు సంబంధించిన డైలాగులతో పాటు డిటేల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఈ స్క్రిప్టు మీద రామ్ గోపాల్ వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.

    వాయిదాపడ్డ ‘ఆఫీసర్'

    వాయిదాపడ్డ ‘ఆఫీసర్'

    కాగా... ‘ఆఫీసర్' మూవీ మే 25న విడుదల కావాల్సి ఉండగా... కొన్ని టెక్నికల్ కారణాల వల్ల రిలీజ్ వాయిదా వేశారు. ఈ మేరకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. జూన్ 1న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు.

    English summary
    Writer Jaya kumar accused the RGV's new film called Officer with Nagarjuna is another copy of his old script. He said he suspects RGV for practicing plagiarism once again by taking his script without his permission. Now Jaya kumar leaked total script of "Officer" online.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more