twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR: జూనియర్ ఎన్టీఆర్ ముస్లిం గెటప్.. ఆ కారణంగా ట్విస్ట్ కూడా చెప్పేసిన విజయేంద్రప్రసాద్

    |

    ఇండియన్ బిగ్ బడ్జెట్ మల్టీస్టారర్ RRRపై అభిమానులు పెంచుకుంటున్న అంచనాలు మామూలుగా లేవు. ఇక చిత్ర యూనిట్ కూడా అందుకు తగ్గట్లుగానే ప్రమోషన్ డోస్ పెంచాలని అనుకుంటోంది. అయితే సినిమాకు అందరి కంటే ముందే రైటర్ K. విజయేంద్రప్రసాద్ మంచి బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఆసక్తికరమైన విషయాలను కూడా ముందే లీక్ చేసేస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ ముస్లిమ్ గెటప్ పై వస్తున్న కామెంట్స్ కు కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు.

    ముందే చెప్పేస్తున్న రైటర్

    ముందే చెప్పేస్తున్న రైటర్

    సినిమాకు కథను అంధించి కె.విజయేంద్రప్రసాద్ సినిమా లోని ఆసక్తికరమైన విషయాలను చాలా ఫ్రీగా చెప్పేస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒక విధంగా రాజమౌళి అలాంటి విషయాలను లీక్ చేయవద్దని ముందే తనతో వర్క్ చేసేవారితో అంటుంటారు. ఇక విజయేంద్రప్రసాద్ మాత్రం సినిమాకు బజ్ క్రియేట్ అయ్యే విధంగానే ట్విస్టులను రివీల్ చేస్తున్నారు.

    పరిస్థితులను బట్టి కూడా ఆన్సర్

    పరిస్థితులను బట్టి కూడా ఆన్సర్

    ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు అనే విషయం ఒక దర్శకుడి కంటే కూడా రైటర్ కు ఎక్కువగా తెలుసనేది అందరికి తెలిసిందే. ఇక విజయేంద్రప్రసాద్ కూడా పరిస్థితులను బట్టి కూడా ఆన్సర్ ఇచ్చేస్తున్నారు. కొమరం భీమ్ టీజర్ రిలీజ్ అయినప్పుడు అందులో ఒక షాట్ లో తారక్ ముస్లిమ్ గెటప్ లో కనిపించడంతో ఓ వర్గం వారి నుంచి విమర్శలు వచ్చాయి.

    అందుకే ముస్లిమ్ గెటప్ లో..

    అందుకే ముస్లిమ్ గెటప్ లో..

    ఇక ఆ సెన్సిటివ్ విషయంపై రైటర్ విజయేంద్రప్రసాద్ సుత్తి లేకుండా అసలు ట్విస్టును లీక్ చేసి క్లారిటీ ఇచ్చేశారు. సినిమాలో నిజాం నవాబుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొనే ఆ పాత్ర సడన్ గా పొలీసులు టార్గెట్ చేయడంతో అలా ముస్లిం అబ్బాయిగా చేంజ్ అవుతాడాని అది కథలో బాగంగా హీరోను ఎలివేట్ చేసే విధంగా ఉంటుందని అన్నారు.

    Recommended Video

    RRR Movie : Biggest Record Ever In Indian Cinema | RRR Pre Release Business | Filmibeat Telugu
     ఎవరిని నొప్పించకుండా

    ఎవరిని నొప్పించకుండా

    ఎవరిని నొప్పించకుండా పాత్రకు మరింత గౌరవం దక్కేలా సీన్స్ ను క్రియేట్ చేసినట్లు చెబుతూ.. ఆ సమయంలో ఆ సీన్స్ కరెక్ట్ గా వచ్చిందని అన్నారు. ఇక అల్లు అర్జున్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించడం వెనకున్న ట్విస్ట్ వెండితెరపైనే చూడాలని విజయేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ సాంగ్ ను విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

    English summary
    Pan India Big Budget Movie RRR The real buzz has started. Speculations on this visual wonder directed by Rajamouli have already skyrocketed. And the Roar of RRR making video released today also raised the dose of expectations even further.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X