twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Mahesh Babu - SS Rajamouli కాంబో...మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని లీక్ చేసిన విజయేంద్రప్రసాద్

    |

    దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి అనంతరం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా నేషనల్ లెవెల్లో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మీడియా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీపై స్పెషల్ గా ఫోకస్ పెడుతోంది. ఇక మహేష్ బాబుతో చేయబోయే సినిమాపై కూడా అనేక రకాల కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా రైటర్ కె.విజయేంద్రప్రసాద్ ఆ సినిమాకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు.

    మహేష్ బాబును కూడా.. ఆ లెవెల్లోనే..

    మహేష్ బాబును కూడా.. ఆ లెవెల్లోనే..

    దర్శకుడు రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా కూడా ఇక నుంచి పాన్ ఇండియా లెవెల్లోనే రూపొందుతాయని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక RRR ద్వారా జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ లకు పాన్ ఇండియా మార్కెట్ ఇస్తున్న రాజమౌళి ఆ తరువాత మహేష్ బాబును కూడా ఆ లెవెల్లోకి తీసుకురానున్నాడు.

     అవసరం అయితే రెండేళ్ల డేట్స్..

    అవసరం అయితే రెండేళ్ల డేట్స్..

    మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. అందుకే ప్రస్తుతం చేతిలో ఉన్న సర్కారు వారి పాట సినిమాని వీలైనంత త్వరగా ఫినిష్ చేసుకోవాలని డిసైస్ అయ్యాడు. అవసరం అయితే రెండేళ్ల డేట్స్ అయిన ఇవ్వడానికి మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు. సినిమాలో సూపర్ స్టార్ నెవ్వర్ బిఫోర్ అనేలా సర్ ప్రైజ్ ఇస్తాడాని చెప్పవచ్చు.

     ఫైనల్ గా ఒక యాక్షన్ కథ ఫిక్స్

    ఫైనల్ గా ఒక యాక్షన్ కథ ఫిక్స్

    మహేష్ బాబుతో సినిమా చేయాలని రాజమౌళికి చాలా ఏళ్లుగా ఒక ప్లాన్ అయితే ఉంది. తన తండ్రి, రైటర్ విజయేంద్రప్రసాద్ తో చాలా కథలపై చర్చలు జరిపి ఫైనల్ గా ఒక యాక్షన్ కథను లైన్ లోకి తెచ్చాడు. అయితే మొదటి నుంచి కూడా ఆ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని టాక్ అయితే వచ్చింది. కానీ ఆ మధ్యలో నిర్మాత కెఎల్.నారాయణ అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేశారు.

    Recommended Video

    Jagapathi Babu Biography, హిట్లు కాదు వ్యక్తిత్వం ముఖ్యం ||| Oneindia Telugu
    కథపై వర్క్ జరుగుతూనే ఉంది..

    కథపై వర్క్ జరుగుతూనే ఉంది..

    ఇక రైటర్ విజయేంద్రప్రసాద్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ కాంబినేషన్ పై స్పందించారు. సినిమా కథపై వచ్చిన రూమర్స్ కొంత నిజమేనని చెప్పకనే చెప్పారు. కథకు సంబంధించిన పనులేవి కూడా ఇంకా పూర్తవ్వలేదని వర్క్ జరుగుతూనే ఉందని తెలిపారు. ఇక రాజమౌళి మైండ్ లో కొన్ని ఐడియాలు ఉన్నాయి. ఆఫ్రికన్ జంగిల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ తరహాలో సినిమాను ప్లాన్ చేయాలని అనుకుంటున్నాము. దానికి కొంత రీసెర్చ్ చేయాల్సి ఉంది.. అంటూ వివరణ ఇచ్చారు.

    English summary
    In recent interview Vijayendra Prasad gave examples on the stories he offers to top star heroes. When it comes to Mahesh Babu, Vijayendra Prasad reacted in an unexpected way. He said that setting a story for a star hero like Mahesh Babu is very difficult and not an easy job.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X