‘దూకుడు’గా రచయిత కోన వెంకట్
సినీ రచయిత కోన వెంకట్ రేంజ్ ఒక్కసారిగా పెరిగి పోయింది. ఇటీవల ఆయన పని చేసిన 'దూకుడు'చిత్రం భారీ విజయం సాధించడంతో ఆయనకు వరుస పెట్టి అవకాశాలు తన్నుకు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం వెంకట్ గతంతో ఎన్నడూ లేని విధంగా చేతి నిండా బోలెడు సినిమాలతో యమ బిజీగా గడుపుతున్నారు. తెలుగుతో పాటు బాలీవుడ్‌లోనూ తన ముద్ర వేస్తున్నాడు. ఈ విషయమై కోన వెంకట్ మాట్లాడుతూ...''నా జీవితంలో ఎన్నడూ లేవి విధంగా ఒకే సమయంలో చాలా సినిమాలకు పని చేస్తున్నాను, ఇది నిజంగా నాకే ఆశ్యర్యంగా అనిపిస్తోంది'' అని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం కోన వెంకట్ బాలీవుడ్లో సల్మాన్ నటించబోయే నో ఎంట్రీ 2, షేర్ ఖాన్, ఏక్ థా టైగర్ చిత్రాలకు స్ర్కిప్టు రైటర్‌గా పని చేస్తున్నారు. మరో వైపు తెలుగులో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'షాడో', జూనియర్ ఎన్టీఆర్-శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందబోయే చిత్రానికి, బొమ్మరిల్లు భాస్కర్-హీరో రామ్ కాంబినేషన్లో నిర్మాణం కానున్న చిత్రంతో పాటు నందినీరెడ్డి-సిద్ధార్థ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రానికి కూడా స్క్రిప్టు రైటర్‌గా పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











