సందీప్ రెడ్డి వంగాకు ఆ ఇద్దరు హీరోలు చీటింగ్.. అర్జున్ రెడ్డి కథతో.. బయటపెట్టిన కోన వెంకట్
Sandeep Reddy Vanga: తొలి సినిమాతో ఓ డైరెక్టర్ సెన్సేషనల్ హిట్ కొట్టాడు. ఫస్ట్ మూవీతోనే బాక్సాఫీస్ వద్ద భారీ మొత్తంలో కలెక్షన్లు వసూల్ చేసి.. పలు రికార్డులను బ్రేక్ చేశాడు. అతడే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈ డైరెక్టర్ అర్జున్ రెడ్డి సినిమాతో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ..ఇంతా.. కాదు. కేవలం టాలీవుడ్ నే కాదు.. బాలీవుడ్ చూపు కూడా తనపై పడేలా చేసుకున్న డేరింగ్ అండ్ కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అయితే ఆ సినిమాని తెరకెక్కించడానికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎంత కష్టపడ్డారో? ఇలాంటి బాధలు, అనుమానాలు అనుభవించారో ? ప్రముఖ రైటర్ కోనా వెంకట్ చెపుతూ .. కొన్ని షాకింగ్ విషయాలను బయటపెట్టాడు. ఇంతకీ ఆ సంచలన విషయాలేంటో మీరు కూడా ఓ లూక్కేయండి.
టాలీవుడ్ క్రేజీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. విజయ్ దేవరకొండ హీరోగా పెట్టి అర్జున్ రెడ్డి అనే కల్ట్ మూవీని తెరకెక్కించారు. ఈ మూవీతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇలా తొలి సినిమాకే ప్రత్యేక ముద్రను సంపాదించుకున్న సందీప్ .. బాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు తీసే రేంజ్ చేరుకున్నారు. ఇటీవల బాలీవుడ్ లో యానిమల్ సినిమాను తీసి ఎంత పెద్ద హిట్ కొట్టాడో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్‌తో పాన్ ఇండియా మూవీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. నిజంగా తొలి సినిమాకే ప్రత్యేక ముద్రను సంపాదించుకునే డైరెక్టర్లు చాలా రేర్. అలాంటి అరుదైన దర్శకుల్లో సందీప్ రెడ్డి ఒకరు.

అయితే.. సక్సెస్ మూవీ అర్జున్ రెడ్డిని తెరకెక్కించడం వెనక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఎలాంటి కష్టపడ్డాడో.. ఎలాంటి అవమానాలను ఎదుర్కొన్నారో ప్రముఖ రైటర్ కోన వెంకట్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. సినిమా అవకాశాల పేరిట ఆయనను ఎలా మోసం చేశారో పలు సంచలన విషయాలను వెల్లడించారు. రచయిత కోనా వెంకట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనతో సందీప్ రెడ్డి వంగా పలు విషయాలను తనతో పంచుకున్నాడని, అర్జున్ రెడ్డి మూవీ తెరకెక్కించడం కోసం.. ఓ హీరో ఆఫీస్ లో మూడు సంవత్సరాలు పనిచేశారు. టైంకి పుడ్ పెడుతున్నారు కదా. కథ బయటకు వస్తే చాలు అని అనుకున్నాడు. ఆ హీరో కూడా కచ్చితంగా ఇదే కథ చేద్దామని చెప్పడం, ఆ మాటలను సందీప్ నమ్మడం. అలా మూడేళ్లు అయిపోయానని తెలిపారంట.
'తీరా ఓ రోజు ఆ హీరో దగ్గరికి వెళ్లి అడిగితే.. ఇన్ డైరెక్ట్ గా ఈ మూవీ తనతో చేసే ఉద్దేశం లేదని చెప్పారంట. దీంతో సందీప్ వేరే హీరో ఆఫీస్ కి వెళ్ళాడు. అతను కూడా ఇంకో రెండేళ్లు సందీప్ ను వాడుకున్నాడు. మొత్తంగా 'అర్జున్ రెడ్డి స్టోరీని పట్టుకుని 5 ఏండ్ల పాటు హీరోల ఆఫీసుల చుట్టూ తిరిగాడు . అంటే.. సందీప్ తపన అర్థం చేసుకోవచ్చు. ఆయన కష్టం చూడలేక.. అతని సోదరుడు నిర్మాతగా మారి అర్జున్ రెడ్డి చేయడానికి ముందుకు వచ్చారు. ఆ తరువాత విజయ్ దేవరకొండ కూడా సందీప్ స్టోరీని నమ్మి.. ఆ కథ చేశాడు. తర్వాత అది బ్లాక్ బస్టర్ గా మారింది. ఇలా అర్జున్ రెడ్డి మూవీ తీయడానికి సందీప్ 5 ఏండ్లు పట్టింది " అంటూ కోన వెంకట్ పలు షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ప్రస్తుతం కోన వెంకట్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.


Click it and Unblock the Notifications











