ప్రతిభను మెచ్చుకునే తత్వం ఎన్టీఆర్ ప్రత్యేకం
స్క్రిప్టు దశ నుంచి ఎన్టీఆర్ నన్నెంతో ప్రోత్సహించారు. సెట్ లో చాలా సార్లు ప్రశంసించారు. రచయితలోని ప్రతిభను మెచ్చుకునే తత్వం ఎన్టీఆర్ ప్రత్యేకం అంటున్నారు మాటల రచయిత కొరటాల శివ. ఆయన తాజా చిత్రం బృందావనం చిత్రం డైలాగులు బాగున్నాయని అంతటా వినిపిస్తున్నాయంటూ ఆయన మీడియాని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...కథలోని భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తూనే హీరో ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని రాసే సంభాషణలు ఎప్పుడూ మెప్పు పొందుతాయి. నేను డైలాగులు రాసే ప్రతి సారీ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటాను అని అన్నారు.
అలాగే బృందావనం...మాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ తొలిసారి క్లాస్ టచ్‌తో చేస్తున్న సినిమా కావడంతో అమితమైన జాగ్రత్తలు తీసుకున్నాం. సినిమా విడుదల య్యాక ప్రతి ఒక్కరూ డైలాగులు బాగున్నాయంటే సంతృప్తికరంగా ఉంది అన్నారు. ఇక కొరటాల శివ కెరీర్ ప్రారంభంలో పోసాని కృష్ణమురళి దగ్గర దాదాపు ఐదేళ్ళు శిష్యరికం చేశారు. 'భద్ర', 'మున్నా', 'ఒక్కడున్నాడు' వంటి చిత్రాలు రచయితగా చేసారు. ప్రస్తుతం ఆయన..ఎన్టీఆర్ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించే రచ్చ సినిమాకు పనిచేస్తున్నారు.


Click it and Unblock the Notifications











