పవన్ కళ్యాణ్ తో రాజమౌళి.. మల్టీస్టారర్ కష్టం.. అప్పటిలోపు సీఎం కావచ్చు: కె.విజయేంద్ర ప్రసాద్

ఫైనల్ గా దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో కూడా సినిమా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ కాంబినేషన్ పదేళ్ల క్రితమే అనుకున్నది కాకపోతే సరైన సమయం సెట్ కాకపోవడం వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇక మొత్తానికి దర్శకుడు రాజమౌళి మహేష్ బాబును డైరెక్ట్ చేసేందుకు పవర్ఫుల్ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకుంటున్నట్లు ఇటీవల విజయేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు. అయితే దర్శకుడు రాజమౌళి పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తాడా లేదా అసలు ఇంతవరకు ఎందుకు చేయలేదు అనే విషయంపై కూడా ఈ అగ్ర రచయిత ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

సంచలన విజయం

సంచలన విజయం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ ఏకం చేసి అతిపెద్ద మల్టీస్టారర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన రాజమౌళి మొత్తానికి బాక్సాఫీస్ వద్ద మరో సంచలన రికార్డు నమోదు చేసుకున్నాడు. టాలీవుడ్ స్థాయి పెరిగే విధంగా RRR ను తెరకెక్కించిన రాజమౌళి భవిష్యత్తులో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలను తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పవచ్చు. ఇక తదుపరి సినిమాను మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే.

అప్పట్లో పవన్ కళ్యాణ్ తో..

అప్పట్లో పవన్ కళ్యాణ్ తో..

దర్శకుడు రాజమౌళి తో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరోకు కూడా ఉంటుంది. ఆయన కథ చెప్పకపోయినా కూడా డేట్స్ ఇవ్వడానికి సిద్ధమేనే హీరోలు కూడా ఉన్నారు. రాజమౌళికి కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే చాలా ఇష్టం. ఇక గతంలో ఆయన పవన్ కళ్యాణ్ తో కూడా ఓ సినిమా చేయాలని చాలా ప్రయత్నాలు చేసాడు. ముఖ్యంగా మొదట విక్రమార్కుడు కథ రాసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ తో చేస్తే బాగుంటుంది అని అనుకున్నారు కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ మరో కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటం వలన ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు.

విజయేంద్రప్రసాద్ కామెంట్

విజయేంద్రప్రసాద్ కామెంట్

ఇక రీసెంట్ గా రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత కే.విజయేంద్రప్రసాద్ పవన్ కళ్యాణ్ రాజమౌళి కాంబినేషన్ పై కామెంట్ చేశాడు. రాజమౌళి పవన్ కళ్యాణ్ తో మాత్రమే చేయాల్సి ఉందని ఆ కాంబో కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనే ప్రశ్నకు రాజేంద్రప్రసాద్ సానుకూలంగా సమాధానమిచ్చారు. దేనికైనా టైం కలిసి రావాలి అని దర్శకుడికి హీరోకు ఇద్దరికీ అనువైన సమయం దొరికితే ఆ ప్రాజెక్ట్ సెట్ అవుతుంది అని తెలియజేశారు.

పవన్ సీఎం కావచ్చు

పవన్ సీఎం కావచ్చు

ముందు మహేష్ బాబు సినిమా అయిపోయిన తర్వాతనే రాజమౌళి తన తదుపరి సినిమా గురించి ఆలోచిస్తారని అయితే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ఒకవేళ సినిమా చేయాల్సి వస్తే అప్పటి వరకు ఆయన ఖాళీగా ఉంటారా లేదా అని నమ్మకం కూడా లేదు అని అన్నారు. ఒకవేళ అప్పటి లోపు అనుకుంటే అప్పుడు ఆయన ఆయన సీఎం కావొచ్చేమో అని అన్నారు.

Recommended Video

Mahesh Babu Ss Rajamouli Movie Genre Revealed | బాబు ఫ్యాన్స్ గెట్ రెడీ..!! || Filmibeat Telugu
పవన్ తో మల్టీస్టారర్

పవన్ తో మల్టీస్టారర్

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ సినిమా చేయడం అంత సాధ్యమయ్యే విషయం కాదు అని ఆయనతో సమానంగా మ్యాచ్ అయ్యే మరొక హీరో లేరని పవన్ కళ్యాణ్ మెగా హీరో అంటూ విజయేంద్రప్రసాద్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. ఇక కాలం కలిసి వస్తే తాను పవన్ కళ్యాణ్ కు కథ రాసే అవకాశం ఉండవచ్చు అని కూడా విజయేంద్రప్రసాద్ తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X