twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవిబాబును తిట్టేద్దామనుకున్నా..; కృష్ణవంశీ కుదరదంటే లేచి వెళ్లిపోయాను: లక్ష్మీ భూపాల్

    |

    Recommended Video

    రవిబాబును తిట్టేద్దామనుకున్నా..లేచి వెళ్లిపోయాను..!

    'అలా మొదలైంది' సినిమాతో అందరి దృష్టిలో పడ్డ రచయిత లక్ష్మీ భూపాల్. సంభాషణల రచయితగానే కాక.. గేయ రచయితగానూ ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది 'నేనే రాజు నేనే మంత్రి'తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ స్థాయికి ఎదిగిన లక్ష్మీ భూపాల్.. ఒకప్పుడు మెకానిక్ గా పనిచేశారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోతే.. అప్పటినుంచి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఇక్కడిదాకా వచ్చారు. ఆ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న ఆటుపోట్ల గురించి ఆయన మాటల్లోనే..

    నాన్న మరణంతో..:

    నాన్న మరణంతో..:

    మా స్వగ్రామం ఏలూరు. పుట్టిందీ, పెరిగిందీ, చదువుకుందీ అంతా అక్కడే. ఇంటర్‌ వరకూ సీరియస్‌గానే చదువుకున్నా. కానీ నాన్న గారి అకాల మరణం.. అంతా తలకిందులు చేసింది. చదువు గాడి తప్పింది.

     స్క్రీన్‌ప్లే మారిపోయింది..:

    స్క్రీన్‌ప్లే మారిపోయింది..:

    మా నాన్న పెద్దిరాజు. ఆర్టీసీలో ఉద్యోగి. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబమే అయినప్పటికీ.. నాన్న మరణంతో ఒక్కసారిగా స్క్రీన్‌ప్లే మొత్తం మారిపోయింది. సొంత ఇల్లు కూడా అమ్మేసి అద్దె ఇంట్లోకి మారిపోయిన పరిస్థితి. అప్పటికి ఇద్దరు చెల్లెల్లకు ఇంకా ఊహ కూడా తెలియని వయసు. అన్నలా, తండ్రిలా వాళ్లని పెంచాల్సి వచ్చింది. నాకంటే మా అమ్మకే నా మీద నమ్మకం ఎక్కువ.

    మెకానిక్‌గా పనిచేశాను:

    మెకానిక్‌గా పనిచేశాను:

    నాన్న మరణంతో ఇల్లు గడవడం కష్టమైపోయింది. దీంతో చిన్న వయసు నుంచే సంపాదనలో పడ్డాను. చిన్నప్పటి నుంచి ఉన్న బొమ్మలేసే అలవాటు కష్టకాలంలో పనికొచ్చింది.

    సైన్‌ బోర్డులు, హోర్డింగులు, బ్యానర్లు రాసేవాడిని. కొన్నాళ్లకు మా నాన్న గారి ఉద్యోగం నాకు వచ్చింది. ఆర్టీసీలో మెకానిక్‌గా చేరి మూడేళ్లకే వదిలేశా. బంగారం లాంటి ఉద్యోగం వదిలేశాడని అంతా తిట్టారు. అమ్మ మాత్రం ఎప్పటిలాగే నాకు అండగా నిలబడింది.

    జీకేతో పరిచయం:

    జీకేతో పరిచయం:

    ఆర్టీసీలో ఉద్యోగం మానేశాక సిటీ కేబుల్‌లో ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వచ్చి జీకేతో అప్పుడే పరిచయం ఏర్పడింది. జెమినీ, ఈటీవిల్లో ఆయన కొన్ని ప్రోగ్రామ్స్ చేసేవారు. హైదరాబాద్ వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. అలా ఆయనతో పాటు హైదరాబాద్ వచ్చేశా.

    లక్ష్మీపతి చొరవతో..:

    లక్ష్మీపతి చొరవతో..:


    జీకే వద్ద కొన్నాళ్లు సహాయకుడిగాను.. అలాగే రాఘవేంద్రరావు 'విజన్ 2020'కోసం పనిచేశాను. ఆ తర్వాత అనుకోకుండా మళ్లీ ఏలూరు వెళ్లి అక్కడే నాలుగేళ్లు ఉండాల్సి వచ్చింది. తిరిగొచ్చాక.. ఓరోజు హాస్యనటుడు లక్ష్మీపతి గారిని కలిశాను. 'మీరు రైటర్ కదా..' అంటూ రవిబాబు వద్ద ప్రయత్నిస్తారా? అని అడిగారు. అలా తొలిసారి సినిమా బీజం పడింది.

    'ఈడు రైటరా' అన్నాడు:

    'ఈడు రైటరా' అన్నాడు:

    'సోగ్గాడు' సినిమా కోసం రవిబాబు నివాస్ చేత డైలాగ్స్ రాయిస్తున్నారు. అందులో కొన్ని సీన్స్ మరో రచయితకి ఇవ్వాలనుకుంటున్నారు. మీరు ప్రయత్నించడని చెప్పి నన్ను రవిబాబుకు పరిచయం చేశారు లక్ష్మీపతి. అప్పట్లో నా అవతారం విచిత్రంగా ఉండేది. 'ఈడు రైటరా' అంటూ ఆయన విసుక్కున్నారు. నాకు కోపం వచ్చింది.

    అలా రచయితగా మొదలయ్యాను..:

    అలా రచయితగా మొదలయ్యాను..:

    రెండో రోజు వెళ్తే పట్టించుకోలేదు. మూడో రోజు సెట్‌కి వెళ్తే... అసలు అక్కడ షూటింగే లేదు. అర్జెంటుగా రవిబాబు నంబరు కనుక్కుని ఫోన్‌ చేసి తిట్టేద్దామనిపించింది. కానీ ఇంతలోనే రామానాయుడు స్టూడియోకు రావాలని ఫోన్ కాల్. దీంతో ఆ కోపమంతా ఎగిరిపోయింది.

    అప్పటికే పరుచూరి బ్రదర్స్, నివాస్ రెండు వెర్షన్స్ రాశారు. కానీ కొత్తగా రాయాలని రవిబాబు ఆ సీన్స్ నాకిచ్చారు. అప్పటికీ సీన్స్ ఎలా రాస్తారో కూడా నాకు తెలియదు. వాళ్లు రాసింది చూసి ఆ ఫార్మాట్ లో రాసేశాను. లక్కీగా అది వాళ్లకు నచ్చేయడంతో 'సోగ్గాడు'తో రచయితగా నా ప్రయాణం మొదలైంది.

    రవిబాబును తిట్టేద్దామనుకున్నా..:

    రవిబాబును తిట్టేద్దామనుకున్నా..:

    'సోగ్గాడు'కి పనిచేస్తున్న సమయంలో.. ఫస్ట్ సీన్ రాసినప్పుడు 'ప్రేమొచ్చింది' అని ఓ పదం రాశాను. అది చూసి రవిబాబుకు చిర్రెత్తుకొచ్చింది. 'జ్వరమొచ్చింది, కోపమొచ్చిందిలా ఈ ప్రేమొచ్చింది ఏంటి? బాగాలేదు.. మార్చేయ్' అన్నారు. నేను మాత్రం.. 'ఇదో ఇదో కొత్త ఎక్స్‌ప్రెషన్‌. మార్చడం కుదరదు' అని పెన్నూ పేపరూ పక్కన పడేసి వెళ్లిపోయాను.

    కృష్ణవంశీతో గొడవ:

    కృష్ణవంశీతో గొడవ:


    'చందమామ' సినిమా క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఆరోజు సెట్ లో 250మంది దాకా ఆర్టిస్టులు ఉన్నారు. సీన్ ఇంకా రెడీ కాలేదు. కృష్ణవంశీ ఏదో చెబుతున్నారు. కానీ... మనసుకు ఎక్కడం లేదు. 'ఈ సీన్ లెంగ్త్ పెరిగితేనే బలంగా ఉంటుంది' అని ఆయనతో చెప్పాను.

    అవసరం లేదు త్వరగా కానిచ్చేద్దామని ఆయన అన్నారు. నేను మాత్రం 'సీన్ బాగా రావాలంటే.. లెంగ్త్ అవసరం' అని ఖరాఖండిగా చెప్పేశాను. 'ఈ సీన్ గురించి నాకు తెలుసా.. నీకు తెలుసా..' అని ఆయన అనడంతో.. 'మీ ఇష్టం సార్..' అంటూ లేచి వెళ్లిపోయాను.

    English summary
    Dialouge writer Lakshmi Bhupal recently gave an interview about his film journey in tollywood. He shared his personal struggle.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X