నటుడిగా రచయిత పోసాని
దాదాపు వంద తెలుగు సినిమాలకు రచన చేసిన పోసాని కృష్ణ మురళి నటుడిగా మన ముందుకు రాబోతున్నారు. రచయితలు నటులుగా మారడం తెలుగు సినిమా పరిశ్రమలో మామూలే. ఎన్నో సినిమాలకు కథ, మాటలు రాసిన గొల్లపూడి మారుతీరావు ఎన్నో ఏళ్ళ క్రితమే నటుడిగా మారారు. ఆరోజుల్లో రచయితల పారితోషికం తక్కువగా ఉండేది కాబట్టి ఆయన నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుని విజయం సాధించారు. రచయితగా ఉన్నప్పుడు సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేని తాను నటుడిగా మారిన తర్వాత సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నానని గొల్లపూడి స్వయంగా ఒప్పుకున్నారు. రచయిత తనికెళ్ళ భరణి కూడా ఆయన దారిని అనుసరించి నటుడిగా మారి రెండు చేతులా సంపాదిస్తున్నారు.
ప్రభాస్ హీరోగా త్వరలో రానున్న మున్నా చిత్రంలో పోసాని ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. మరో రెండు మూడు సినిమాల్లో కూడా ఆయనకు అవకాశాలు వచ్చాయి. స్వతహాగా ఆవేశపరుడైన పోసాని ఏవైనా సామాజిక సమస్యలు ముందుకు వచ్చినప్పుడు ఆవేశ పూరితమైన ప్రకటనలు ఇస్తుంటారు. ఆయనకు నటనే మంచి కెరీర్ అవుతుందనడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications