RRR డైలాగ్స్ ఎలా ఉంటాయంటే... మొదటిసారి స్పందించిన రైటర్ సాయి మాధవ్
ఇండియన్ బిగెస్ట్ మల్టీస్టారర్ మూవీ RRR మూవీ కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బహుబలి తరువాత అత్యంత భారీ బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో బాలీవుడ్ సినీ జనాలు కూడా ఈ సినిమాపై అంచనాలు భారీగానే పెంచుకుంటున్నారు. అయితే ఈ పాన్ ఇండియాకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయాలని రైటర్ సాయి మాదవ్ బుర్ర మొదటిసారి బయటపెట్టారు. ఆయన RRRకి మాటలు అందిస్తున్న విషయం తెలిసిందే.

రాజమౌళి సైలెన్స్..
కరోనా వైరస్ గోల లేకపోయి ఉంటే ఈ పాటికె సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకునేవి. ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ టీజర్ కూడా రిలీజయ్యి ఉండేది. కానీ కరోనా కారణంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా షూటింగ్ చెసే అవకాశం దొరకడం లేదు. రాజమౌళి కూడా ఇప్పట్లో ఏమి చేయలేమని సైలెంట్ అయ్యారు.

రాజమౌళితో మొదటిసారి..
ఇక చాలా రోజుల తరువాత సాయి మాధవ్ సినిమాకు ఆయన వర్క్ చేసిన విధానం గురించి వివరంగా చెప్పారు. కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి, మహానటి వంటి ఉత్తమ చిత్రాలకు మాటలు అందించిన ఈ రైటర్ మొదటిసారి రాజమౌళి సినిమాకు డైలాగ్స్ రాశారు. ఇక RRRలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయనేది అందరిలో అంచనాకు డోస్ ని పెంచుతోంది.

ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా
రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా అలాగే ఎన్టీఆర్ కొమురం భీమ్ గా చేస్తున్న పాత్రలకు ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా డైలాగ్స్ ఉంటాయని, అలాగే ఈ ఇద్దరు స్టార్ యాక్టర్స్ తెరపై సమానంగా కనిపించేలా నటిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంలో అభిమానులకు ఇద్దరు హీరోలను ఒకే విదంగా చూస్తారని సాయి మాధవ్ చెప్పిన విధానం సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది.
Recommended Video

మ్యూజిక్ విషయంలో కూడా..
కేవలం డైలాగ్స్ సమానంగా ఉంటయని మాత్రమే చెప్పిన సాయి మాధవ్ మిగతా విషయాల గురించి ఎక్కువగా మాట్లాడకూడదని ఆ మ్యాటర్ ని క్లోజ్ చేశారు. ఇక కీరవాణి RRR నెవర్ బిఫోర్ అనేలా సంగీతాన్ని సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ విషయంలో కూడా హీరోల రేంజ్ కి సమానంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుమతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ స్థాయిలో హైప్ క్రియేట్ చేస్తున్న RRR ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











