Srimanthudu Copy Right Issue: "మహేష్ బాబును తప్పించేందుకు నమ్రతా అలా ప్లాన్ చేసింది"
2015 ఆగస్టు 7వ తేదీన మహేష్ బాబు హీరోగా వచ్చిన శ్రీమంతుడు సినిమా గురించి అందరికీ తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. హిట్టుగా నిలిచిన ఈ సినిమా కథ తనదే అంటూ రైటర్ శరత్ చంద్ర ముందు నుంచీ చెబుతూనే వస్తూ ఉన్నారు. ఈ సినిమా కాపీ రైట్ వివాదం అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా రైటర్ శరత్ చంద్ర.. ఇదే విషయంపై మహేష్ బాబుతో పాటు నవీన్ యెర్నేనిలపై సుప్రీంకోర్టులో కేసు పెట్టబోతున్నట్లు తెలిపారు. ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రైటర్ శరత్ చంద్ర 2012లో రాసిన చచ్చేంత ప్రేమ అనే నవల స్వాతి మాస పత్రికలో ప్రచురితం అయినట్లు తెలిపారు. అలాగే ఆ కథతో ఓ సినిమా చేస్తే బాగుంటుందని అనుకున్న ఆయన డైరెక్టర్ సముద్రఖనని కలిసినట్లు వివరించారు. అయితే తాము ప్రాజెక్టు ప్రారంభించాలనుకున్న సమయంలోనే శ్రీమంతుడు సినిమా వచ్చిందని.. అది చూసిన వారంతా తనకు అది నీ కథే అని చెప్పగా.. తాను కూడా ఆ సినిమా చూసినట్లు వెల్లడించారు. అయితే తాను రాసిన ప్రతీ సీన్ ఆ సినిమాలో అచ్చు దిగిందని.. నేరుగా శ్రీమంతుడు డైరెక్టర్ వద్దకు వెళ్లి ఈ కథ తనదే అని కూడా చెప్పినట్లు గుర్తు చేశారు.

అయితే డైరెక్టర్ అస్సలే ఒప్పుకేలేదని.. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న చాలా మంది సినీ ప్రముఖులు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారని వివరించారు. అలాగే 15 లక్షలు ఇస్తాం.. ఇక దీని గురించి మర్చిపొమ్మంటూ చెప్పారని కూడా అన్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే తనకు రచయితల సంఘం వాళ్లు చాలా బాగా సహకరించారని.. వారి వల్లే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించగల్గినట్లు కూడా వెల్లడించారు. అలాగే తాను ఇదే విషయంపై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లబోతున్నట్లు కూడా క్లారిటీ ఇచ్చారు.
ముఖ్యంగా హీరో మహేష్ బాబుతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ కు చెందిన నవీన్ యెర్నేనిపై కూడా సుప్రీంకోర్టులో కేసు పెట్టబోతున్నట్లు వివరించారు. గతంలోనూ తాను మహేష్ బాబుకు నోటీసులు పంపేందుకు ప్రయత్నాలు చేయగా.. ఈ కేసు నుంచి ఆయన్ను తప్పించడాకని ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ చాలా ప్రయత్నాలు చేశారని వివరించారు. ముఖ్యంగా మహేష్ బాబు పేరుపై ఉన్న ఎంబీ క్రియేషన్స్ యాజమాన్యం నుంచి మహేష్ బాబును తొలగించి గంగాధర్ కు అప్పగించారని వెల్లడించారు.

కానీ తాను మాత్రం ఈ కేసులో వెనక్కి తగ్గే ఆలోచనే లేదని.. శ్రీమంతుడు సినిమా కథపై తానొక్కడికే హక్కులు ఉన్నాయని రైటర్ శరత్ చంద్ర వివరించారు. ఇప్పటికే ఈ కేసుపై నాంపల్లి కోర్టు.. కడైరక్టర్ కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దాన్ని సవాల్ చేస్తూ.. డైరెక్టర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయింగా.. చుక్కెదురైంది. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. కానీ అక్కడా అదే పరిస్థితి. దీంతో స్థానిక కోర్టు ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది.


Click it and Unblock the Notifications











