సుద్దాల అశోక్ తేజ ఆరోగ్యంపై రూమర్లు.. ఖండించిన ఫ్యామిలీ.. ఏం జరిగిందంటే
ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆరోగ్యంపై పలు రూమర్లు రోజంతా మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఆనార్యోగ్యం కారణంగా ఆయన పరిస్థితి విషమించిందనే వార్తలతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పలువురు అశోక్ తేజ ఆరోగ్యంపై ఆరా తీశారు. దాంతో ఆయన స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆరోగ్యంపై వివరణ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
రచయిత అశోక్ తేజ కొద్దికాలంగా లివర్ వ్యాధితో బాధపడుతున్నారు. దాంతో ఆయనను గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స కోసం చేర్పించారు. ఆయనకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయనకు బీ నెగిటివ్ రక్తం కావాలని, ఎవరైన దాత ముందుకొస్తే 8985038016 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

అశోక్ తేజ ఆరోగ్యంపై రూమర్లు
ఈ క్రమంలో అశోక్ తేజ ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు మీడియాలో హల్‌చల్ చేయడంతో సినీ వర్గాలు స్పందించాయి. ఆయన ఆరోగ్యం గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఆయన క్షేమంగానే ఉన్నారని ఆయన స్నేహితులు వివరణ ఇచ్చారు. అయినా ఆయనపై రూమర్లు ఆగకపోవడంతో కుటుంబ సభ్యులు స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని చెప్పారు.

స్వయంగా ఖండించిన అశోక్ తేజ
ఇలాంటి వార్తల మధ్య స్వయంగా హాస్పిటల్ నుంచి అశోక్ తేజ ఓ ప్రకటనను విడుదల చేశారు. నా ఆరోగ్యం బాగానే ఉంది. ప్రస్తుతం హస్పిటల్‌లో చికిత్స జరుగుతున్నది. నా ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దు. నా ఆరోగ్యంపై వస్తున్న రూమర్లు వాస్తవం కాదు అని ఆయన తన ప్రకటనలో తెలిపారు.
Recommended Video

జాతీయ అవార్డు గ్రహీతగా
సామాజిక సమస్యలపైనే కాకుండా వినోదానికి పెద్ద పీట వేస్తూ అశోక్ తేజ రాసిన పాటలు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. నమస్తే అన్న చిత్రానికి పాటలు రాయడం ద్వారా ఆయన తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఠాగూర్ సినిమాలో నేను సైతం పాట రాసిన ఆయనకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డుతో సత్కరించింది. ఇటీవల కాలంలో ఫిదాలో ఆయన రాసిన పాట అన్ని మీడియా ఫ్లాట్‌ఫాంలో దుమ్మురేపింది. సినీ నటుడు ఉత్తేజ్‌కి సుద్దాల సమీప బంధువు అనే విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











