సినిమా వాళ్ళను అంటే ఊరుకోం..మహారథి
సినిమావాళ్లు రాజకీయ నాయకులను గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని కొందరు నాయకులు అంటున్నారని, అయితే సినిమా వాళ్ల గురించి మాట్లాడేటప్పుడు వారూ అదే జాగ్రత్తతో వ్యవహరించాలని ప్రముఖ సినీ రచయిత త్రిపురనేని మహారథి పేర్కొన్నారు. హైదరాబాద్‌పై మెహర్బానీతో చిత్రపరిశ్రమ రాలేదని, ఇక్కడి సౌకర్యాలు చూసి వచ్చారంటూ మాజీ మంత్రి జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆదివారం ఓ ప్రకటనలో మహారథి ఖండించారు.
ఆయన తాజాగా జరుగుతున్న సంఘటనలపై మీడియాతో మాట్లాడుతూ..చిత్రపరిశ్రమకు అవసరమైన ఏ సౌకర్యమూ లేనప్పటికీ.. రాష్ట్రంలో పరిశ్రమను నిలబెట్టుకోవాలనే తపన, అప్పటి ప్రభుత్వ ఆహ్వానం మేరకే హైదరాబాద్ వచ్చామన్నారు. అయినా అసలు ప్రభుత్వం ఆ దిశలో ఆ లోచించక ముందే అక్కినేని నాగేశ్వరరావు తమ మకాంను హైదరాబాద్‌కు మార్చారని గుర్తు చేశారు.అప్పటికే మ ద్రాసులో సినీ పరిశ్రమకు సంపూర్ణ సౌకర్యాలున్నాయన్నారు.
బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో (1967) పరిశ్రమ తరలింపుపై సారథీ స్టూడియోలో ఓ సమావేశం జరిగిందని.. సంగీతం, మేకప్ దగ్గర నుంచి లైట్‌బాయ్ వరకు మద్రాసు నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితిల్లో తరలింపు ఎట్లా సాధ్యమనే సందేహాలు వ్యక్తమయ్యాయని గుర్తుచేశారు. దానితో అన్ని రకాల వసతుల ఏర్పాటుకూ, నివాసాలకూ హైదరాబాద్‌లో స్థలాలు ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించిందన్నారు. ఆ మేరకు వెంగళరావు హ యాంలో అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి స్థలం కేటాయించారని చెప్పారు. ఫిలింనగర్ స్థలాలను ఉచితంగా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. త్రిపురనేని మహారధి గతంలో రైతు భారతం చిత్రాన్ని నిర్మించారు. దేముడు చేసిన మనుష్యులు, అల్లూరి సీతారామ రాజు వంటి చారిత్రిక చిత్రాలకు రచన చేసి పేరెన్నిక గన్నారు.


Click it and Unblock the Notifications











