సినీ రచయిత త్రిపురనేని మహారథి మృతి
ప్రముఖ సినీ రచయిత త్రిపురనేని మహారథి(82) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. త్రిపురనేని మరణంతో సినీ రంగంలో విషాదం నెలకొంది. ఆయన ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.
త్రిపురనేని బంధిపోటు, అల్లూరి సీతారామరాజు, సింహాసనం, దేవుడు చేసిన మనుషులు, దేశోద్ధారకులు, అన్నదమ్ముల సవాల్, పాడి పంటలు సినిమాలకు రచనలు అందించారు. ఆయన చివరి సారిగా శాంతి సందేశం సినిమాకు మాటలు అందించారు. బందిపోటు, అల్లూరి సీతారామ రాజు సినిమాలతో త్రిపురనేనికి మంచి పేరు వచ్చింది. అల్లూరి సీతారామరాజు సినిమా కోసం అన్ని సినిమా ఆఫర్లను వదులుకుని తపస్సులా రచన చేశారు. కృష్ణ నటించిన సింహాసనం చిత్రంలో ఓ కీలక పాత్ర కూడా పోషించారు.
రైతు భారతం, దేశం అంటే మనుషులోయ్ అనే చిత్రాలను స్వయంగా నిర్మించిన త్రిపురనేని స్ర్కీన్ ప్లే అందించడంలో దిట్ట. అప్పట్లో 'త్రిలింగ ప్రజా ప్రగతి' అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. పార్టీ స్థాపించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రథ యాత్రలు చేశారు.


Click it and Unblock the Notifications











