'అఖిల్' మూవీ ఆ హీరోతో తీస్తే మరోలా ఉండేది.. ముందు ఆ హీరో కోసం అనుకున్నదే..
అక్కినేని అఖిల్ కెరీర్ లో భారీ అంచనాలనతో విడుదలైన అఖిల్ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ గా నిలిచిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమాకు అప్పట్లో వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. స్మార్ట్ హీరోగా ముందుగానే జనాలకు బాగా కనెక్ట్ అయిన అఖిల్ మొదటి సినిమా విడుదలకు ముందే ఒక రేంజ్ లో క్రేజ్ అందుకున్నాడు. అయితే ఆ సినిమా కథ మొదట అఖిల్ కోసం అనుకోలేదట. వేరే పెద్ద హీరో కోసం అనుకున్నట్లు ఆ కథను రాసిన రైటర్ చెప్పాడు.

అఖిల్ హిట్టయ్యి ఉంటే..
అక్కినేని అఖిల్ మొదటి సినిమా సక్సెస్ అయ్యి ఉంటే అతని కెరీర్ మరోలా ఉండేదని చాలా మంది చెబుతుంటారు. మాస్ అడియెన్స్ లో అతనికి మొదట్లో మామూలు ఫాలోయింగ్ రాలేదు. ఇక దర్శకుడు వివి.వినాయక్ అనేసరికి అంచనాల డోస్ అమాంతంగా పెరిగిపోయాయి.

అఖిల్ కోసం కథను రాసింది అతనే
రెండేళ్లకు పైగా నాగార్జున అఖిల్ కోసం అనేక రకాల కథలు విన్నాడు. ఇక ఫైనల్ గా వినాయక్ నితిన్ మాట్లాడుకొని అఖిల్ కోసం కథను రెడీ చేయించారు. ఆ కథను రాసింది వెలిగొండ శ్రీనివాస్. అప్పటికే అతను మంచి ఫామ్ లో ఉన్నాడు. నాగార్జున డమరుకం కథను అందించింది కూడా అతనే.

అఖిల్ కోసం కథను మార్చి..
ఇక వినాయక్ లాంటి సీనియర్ దర్శకుడు అలాగే యువ హీరో నితిన్ అడగడంతో నాగార్జున అఖిల్ ను వాళ్ళ చేతుల్లో పెట్టేశాడు. వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదని కథ విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. అయితే ఆ కథ వేరే హీరో కోసం రాసుకున్నప్పుడు మరోలా ఉండగా అఖిల్ దగ్గరకు వచ్చేసరికి మరొకాలా మార్చారట.
Recommended Video

రామ్ చరణ్ కోసం రాసుకున్న కథ..
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కథను అందించిన వెలిగొండ శ్రీనివాస్ ఆ విషయాన్ని చెప్పాడు. ఆయన మాట్లాడుతూ.. మొదట అఖిల్ కథను రామ్ చరణ్ కోసం రాసుకున్నాము. ఆయన స్థాయికి కరెక్ట్ గా సరిపోయేలా ప్రజెంట్ చేయడం జరిగింసి. కానీ అఖిల్ ఆ కథలో అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో హైలెట్ చెయ్యాలనే పాయింట్ లో తేడా కొట్టేసింది. హీరో కూడా కథకు ఆ స్థాయిలో కనెక్ట్ కాలేకపోయాడు.. రామ్ చరణ్ లాంటి హీరోతో ఆ సినిమా చేసి ఉంటే మరోలా ఉండేదని శ్రీనివాస్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











