Official: SSMB29 తర్వాత రాజమౌళి 'మహాభారతం'.. RRR2పై విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు శిష్యుడిగా సినిమా కెరీర్ ప్రారంభించిన రాజమౌళి ముందుగా సీరియల్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో సినిమా దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి ఇప్పుడు ప్రపంచస్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. గతేడాది RRR మూవీతో వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని తెలిసిందే. అయితే మహాభారతం, RRR 2 సినిమాలపై ఆయన తండ్రి, రచయతి విజయేంద్ర ప్రసాద్ సంతోషాన్నిచ్చే మాటలు చెప్పారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారనే వివరాల్లోకి వెళితే..
జక్కన్న చిత్రాలు:RRRలోని నాటు నాటు పాటకు ఆస్కార్ తీసుకొచ్చి తెలుగు చిత్రసీమ ఖ్యాతిని యావత్ ప్రపంచానికి చాటి చూపారు దర్శక దిగ్గజం రాజమౌళి. ఇక ఆయన తెరకెక్కించిన మగధీర, ఈగ, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్ చిత్రాలు కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి ప్రేక్షాకాదరణను పొందాయి. ఇలా తొలి సినిమా నుంచి నేటి RRR వరకు ఏ ఒక్క ప్లాప్ మూవీ తీయకుండా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్నారు.

ఇండియానా జోన్స్:ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ తో జక్కన్న సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. SSMB29 కోసం రాజమౌళి పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని టాక్. ఇక ఈ సినిమాలో మహేశ్ బాబు పాత్ర హనుమంతున్ని పోలి ఉంటుందని వార్తలు వినిపించాయి. అమెజాన్ అడవుల్లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కథ ఉండనుంది. ఇండియానా జోన్స్ తరహాలో అడ్వెంచరస్ సినిమాలా ఉంటుందని తెలిసిందే.
10 భాగాలుగా:ఇదిలా ఉంటే రాజమౌళికి అతిపెద్ద డ్రీమ్ మహాభారతాన్ని తెరకెక్కించడం అని చాలా మందికి తెలిసిన విషయమే. ఈ సినిమాను తీయడానికి ముందు దేశంలోని అన్ని మహాభారత గ్రంథాలను చదివి అర్థం చేసుకోవాలని, అందుకు ఎంతలేదన్న కనీసం ఏడాది సమయం పడుతుందని జక్కన్న తెలిపారు. అంతేకాకుండా ఆ చిత్రాన్ని కనీసం 10 భాగాలుగా తీయాలని కూడా చెప్పారు.

భారీ స్థాయిలో:ఇప్పుడు తాజాగా మహాభారతం, SSMB29, RRR 2 సినిమాల గురించి జక్కన్న తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "మహేశ్ బాబు-రాజమౌళి కాంబోలో రానున్న సినిమా (SSMB29) ఒక అడ్వెంచర్ మూవీ. దీన్ని భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాం. RRR చిత్రాన్ని మించి ఈ సినిమా ఉండనుంది" అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
రాజమౌళి పర్యవేక్షణ:"అలాగే ఎన్టీఆర్-రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ (RRR) సీక్వెల్ (RRR2)కు సిద్ధం చేస్తున్నాం. ఒక హాలీవుడ్ చిత్రంగా దీన్ని తెరకెక్కించాలనుకుంటున్నాం. రాజమౌళి దర్శకత్వం వహిస్తారా.. లేదా.. ఎవరైనా హాలీవుడ్ డైరెక్టర్ వర్క్ చేస్తాడా అనేది చెప్పలేం. కాకపోతే రాజమౌళి పర్యవేక్షణలోనే ఈ సినిమా ఉంటుంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో ఉంటుంది" అని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

మహేశ్ తర్వాత:ఇక మహాభారతం సినిమాను కూడా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాం. మహేశ్ సినిమా పూర్తయిన వెంటనే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం మొదలు పెట్టాలనే ఆలోచనలో ఉన్నాం అని రైటర్ విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. దీంతో సినీ ప్రియులు తెగ సంబరపడిపోతున్నారు. వెనువెంటనే రాజమౌళి నుంచి SSMB29, మహాభారతం, RRR 2 రావడంతో సినీ లవర్ కి అంతకుమించిన ఆనందం ఏముంటుందని సంతోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











