మహేష్ బాబు - రాజమౌళి సినిమా ఆలస్యం కావడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన రైటర్

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా అనంతరం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక బిగ్ బడ్జెట్ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడు. అందరి పోకస్ ఎక్కువగా రాజమౌళితో చేయబోయే సినిమా పైనే ఉంది. ఇక ఆ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే వివరాలపై చాలా రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక రీసెంట్ గా కథ రచయిత విజయేంద్రప్రసాద్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

 నమ్మకంతో..

నమ్మకంతో..

మహేష్ బాబు పరశురామ్ కలయికలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం కూడా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఐతే బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకుంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది అని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది.

త్రివిక్రమ్ తో సినిమా..

త్రివిక్రమ్ తో సినిమా..

మహేష్ కూడా ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాల పై కూడా ఒక క్లారిటీ ఇచ్చేశాడు. ఇటీవల త్రివిక్రమ్ సినిమా దర్శకత్వంలో చేయబోయే సినిమాను జూన్ నెలలో మొదలు పెట్టబోతున్నట్లుగా క్లారిటీ అయితే ఇచ్చాడు. ఆ సినిమా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నట్లుగా తెలుస్తోంది.

బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా

బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా


ఇక ఆ తరువాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. ప్రేక్షకులు కూడా ప్రస్తుతం ఆ సినిమా కోసమే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. తప్పకుండా రాజమౌళి దర్శకత్వంలో రాబోయే సినిమా మహేష్ స్థాయిని మరో లెవెల్ కు తీసుకు వెళుతుంది అని చెప్పవచ్చు.

క్లారిటీ ఇచ్చిన కథ రచయిత

క్లారిటీ ఇచ్చిన కథ రచయిత


అయితే ఆ సినిమా ఎలాంటి కథతో రాబోతోంది అనే విషయంలో ఇప్పటికే అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. కథా రచయిత విజయేంద్రప్రసాద్ కూడా గతంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక రీసెంట్ గా కథ రచయిత విజేయేంద్ర ప్రసాద్ మహేష్ బాబు ప్రాజెక్టుపై స్పందించారు. మహేష్ బాబు రాజమౌళి కలయికలో తెరకెక్కబోయే సినిమా RRR కంటే హై రేంజ్ లోనే ఉంటుంది అని ఇదివరకే చెప్పారు.

 స్క్రిప్ట్ సిద్ధం కాలేదు

స్క్రిప్ట్ సిద్ధం కాలేదు

ఇక ఆ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో నే తెరపైకి రాబోతున్నట్లు మరోసారి తెలియజేశారు. ఇంకా పూర్తి స్క్రిప్ట్ అయితే సిద్ధం కాలేదు అని చెప్పిన విజయేంద్రప్రసాద్ ముందుగా మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసిన తర్వాతనే రాజమౌళి ప్రాజెక్టును పాల్గొంటారు అని అన్నారు. అంటే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వలనే రాజమౌళితో సినిమా ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.

 షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే

షూటింగ్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే

అసలైతే రాజమౌళి ప్రాజెక్టు ఈ ఏడాది అక్టోబర్ లోనే మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ ఇటీవల విజయేంద్రప్రసాద్ చెప్పిన ఇంటర్వ్యూల్లో మాత్రం త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ముందు ఉండడం వలన ఆ ప్రాజెక్టు షూటింగ్ వచ్చే ఏడాది మొదట్లోనే స్టార్ట్ అవుతుంది అని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే తెలుస్తాయని విజయేంద్రప్రసాద్ తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X