Vijayendra Prasad: విశాల్ కు ఆ జబ్బు.. బయటపెట్టిన విజయేంద్ర ప్రసాద్, ఆ పాఠాలు గొప్పవి

సినిమాల్లో సామాజిక అంశాలను జోడించి ఎంటర్టైన్ చేసే హీరో విశాల్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వైవిధ్యమైన హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా విశాల్ లాఠీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటివరకు పోలీస్ లు అంటే ఎస్సై, సీఐ, ఐపీస్ వాళ్లపై కథలతోనే సినిమాలు వచ్చాయని కానిస్టేబుల్ పై సినిమా రాలేదని విశాల్ పేర్కొన్నాడు.

అయితే తాజాగా విశాల్ లాఠీ సినిమా టీజర్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాల్ కు ఉన్న జబ్బు గురించి ఆయన చెప్పుకొచ్చారు.

తెలుగు ప్రేక్షకులకు చేరువగా..

తెలుగు ప్రేక్షకులకు చేరువగా..

కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. హీరో విశాల్ కు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలు తెలుగులో కూడా విడుదలై మంచి హిట్ సాధించాయి. పందెం కోడి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో విశాల్. అప్పటి నుంచి తన ప్రతి సినిమాను తెలుగులో కూడా డబ్ చేస్తూ తెలుగు ఆడియెన్స్ కు మరింత దగ్గరవుతున్నాడు.

హీరోయిన్ గా సునయన..

హీరోయిన్ గా సునయన..

సామాజిక అంశాలపై ఎక్కువగా సినిమాలు తెరకెక్కిస్తూ మిగతా వారికంటే భిన్నమైన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు విశాల్. ఇటీవల అభిమన్యు, యాక్షన్, ఎన్మీ చిత్రాలతో అలరించిన విశాల్ ఇప్పుడు లాఠీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్ పై రాబోతున్న హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా లాఠీ చిత్రాన్ని తెరకెక్కించారు. రమణ, నంద సంయుక్త నిర్మాణంలో భారీగా తెరకెక్కిస్తున్నారు. ఇందలో విశాల్ కు జోడిగా సునయన హీరోయిన్ గా నటిస్తోంది.

ముఖ్య అతిథిగా విజయేంద్ర ప్రసాద్..

ముఖ్య అతిథిగా విజయేంద్ర ప్రసాద్..

విశాల్ లాఠీ సినిమాను డిసెంబర్ 22న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్, గ్లింప్స్ లాంచింగ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ తోపాటు హీరో కార్తికేయ, శివబాలాజీ, మధుమిత, అభినయ తదితరులు అతిథులుగా హాజరయ్యారు.

విశాల్ గురించి చెడ్డమాట..

విశాల్ గురించి చెడ్డమాట..

ఈ కార్యక్రమంలో హీరో విశాల్ కు సంబంధించిన చెడ్డమాట, జబ్బు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయేంద్ర ప్రసాద్. "అందరు విశాల్ గురించి గొప్పగా మాట్లాడారు. నేను ఆయన గురించి ఒక చెడ్డమాట చెబుతాను. విశాల్ గారికి ఒక జబ్బు అంటుకుంది. సినిమా కథ ఎంత బడ్జెట్ అయినా ఎన్ని రోజులైనా.. షూటింగ్ చేయాలనే జబ్బు. ఈ జబ్బు మా అబ్బాయి రాజమౌళి దగ్గర నుంచి అంటుకుంది.

మంచి విజయం సాధించాలని..

మంచి విజయం సాధించాలని..

మా అబ్బాయి ఎలా అయితే సక్సెస్ అందుకున్నాడో మంచి మనసున్న విశాల్ కూడా విజయాన్ని అందుకుంటారని కోరుకుంటున్నాను. నేను ఇలాంటి ఈవెంట్స్ కు చాలా తక్కువగా హాజరవుతాను. ఇటీవల కార్తికేయ 2 కార్యక్రమానికి వెళ్లాను. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. భగవంతుని దయవల్ల ఈ లాఠీ సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

ఫ్లవర్ బొకేలు ఇవ్వకండి..

ఫ్లవర్ బొకేలు ఇవ్వకండి..

అనంతరం మాట్లాడిన విశాల్.. తనకు ఫ్లవర్ బొకేలు లాంటివి ఇవ్వొద్దని కోరారు. ఆ డబ్బుతో చిన్న పిల్లలకు సహాయం చేయాలని తన ఫ్యాన్స్ ను మరోసారి కోరుతున్నట్లుగా చెప్పారు. "నేను జీవితంలో చాలా కింద స్థాయిలో ఉండే కష్టాలను చూశాను. అలాగే గొప్పవాళ్లు పొందే ఆనందాన్ని చూశాను. స్కూల్, కాలేజీల్లో చెప్పే పాఠాల కంటే సినిమా నేర్పించే పాఠాలు చాలా గొప్పవి" అని విశాల్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X