twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను చేయనన్నాను, చిరంజీవి ప్రోత్సాహం వల్లే డిజాస్టర్ వచ్చింది: యండమూరి

    |

    తెలుగు నవలా సాహిత్యంలో యండమూరి వీరేంద్రనాథ్ తనదైన ముద్రవేశారు. ఆయన రాసిన నవలలు కొన్ని సినిమాలుగా శత దినోత్సవాలు జరుపుకున్నాయి. అలాంటి యండమూరి వీరేంద్రనాథ్ మెగాఫోన్ కూడా పట్టారు. అలా ఆయన తెరకెక్కించిన సినిమాలలో 'స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్' ఒకటి.

     ధారుణమైన డిజాస్టర్

    ధారుణమైన డిజాస్టర్

    అయితే చిరంజీవి కెరీర్లోనే ధారుణమైన డిజాస్టర్లలో ఈ సినిమాకూడా ఒకటి ఈ సినిమా చాలా సాధారణమైన మాస్ మసాలా మూవీలా ..అతుకుల బొంతలా అనిపించిందనే విమర్శ 'తెలుగు పాప్యులర్ టీవీ' ఇంటర్వ్యూలో యండమూరి వీరేంద్రనాథ్ కి ఎదురైంది.

     తీసేముందు తెలియలేదు

    తీసేముందు తెలియలేదు

    అందుకాయన స్పందిస్తూ .. " ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ .. విజయశాంతి .. నిరోషా .. ఆరుపాటలు. ఇది నాకు ఎంతమాత్రం నచ్చని ఫ్రేమ్. ఇది నీకు తెలియదా తీసేటప్పుడు అని మీరు అడగొచ్చు. తీసేముందు తెలియలేదు .. తీసేటప్పుడు తెలిసింది.

     నువ్ చేయవలసిందే

    నువ్ చేయవలసిందే

    అంతకుముందు నేను డైరెక్ట్ చేసిన 'అగ్నిప్రవేశం' ఫెయిలైంది. అలాంటి పరిస్థితుల్లో చిరంజీవి ఛాన్స్ ఇచ్చాడు. కె.ఎస్. రామారావు వద్దన్నారు .. నేను కూడా వదిలేద్దామనే చెప్పాను. "లేదు .. లేదు .. నువ్ చేయవలసిందే"నంటూ చిరంజీవి సపోర్ట్ చేశారు.

     నేను చేయనని చెప్పాను

    నేను చేయనని చెప్పాను

    ఫస్టు డే షూటింగ్ అయిపోయిన తరువాత కూడా నేను చేయనని చెప్పాను. అప్పుడు అల్లు అరవింద్ గారు కూడా "మీరు బాగా చేయగలరు .. చేయండి" అన్నారు. "అది నా జోనర్ కాదంతే .. "అంటూ చెప్పుకొచ్చారు.

    English summary
    Writer Yandamuri veerendranath reveald a secret behined Stuvart Puram Police Station movie with chiranjeevi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X