»   » కత్తి మహేష్‌కీ పెరుగుతున్న ప్రముఖుల మద్దతు: పవన్ ఫ్యాన్స్ పై నిప్పులు

కత్తి మహేష్‌కీ పెరుగుతున్న ప్రముఖుల మద్దతు: పవన్ ఫ్యాన్స్ పై నిప్పులు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Writers Supports Mahesh Katti In Social Meadia

సినీ విమర్శకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ కత్తి మహేష్, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వివాదం మరింత ముదురుతోంది. టీవీ చర్చా కార్యక్రమాలు, పలు ఇంటర్వ్యూలు వీరి మధ్య వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లు అవుతోంది. దాదాపు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో తెలుగు జనాలందరికీ ఒక్కటే హాట్ టాపిక్ "కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్" ఎక్కడ చూసినా ఇదే రచ్చ. "పవన్ కళ్యాణ్‌ను ఆయన అభిమానులు దేవుడగా భావిస్తారు, ఆయన్ను ఎవరైనా ఏమైనా అంటే వారు ప్రతిఘటిస్తారు.... ఈ విషయం నేను అర్థం చేసుకోగలను, అయితే వారు తనను హెచ్చరిస్తున్న తీరులో హింసాత్మకధోరణి కనపడుతోందని, కొడతాం, చంపుతాం అంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నార"ని కత్తి మహేష్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఐ సపోర్ట్ మహేష్ కత్తీ

ఐ సపోర్ట్ మహేష్ కత్తీ" అనే స్లోగన్ తో

ఇక మరోపక్క పవన్ ఫ్యాన్స్ అంతా ఆయన బర్త్ డేకోసం కామన్ డీపీ అంటూ ఒకే రకమైన ప్రొఫైల్ పిక్చర్ పెట్టినట్టే మహేష్ ని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఆయన ఫొటోని ఫేస్బుక్ డీపీగా పెట్టుకుంటూ "ఐ సపోర్ట్ మహేష్ కత్తీ" అనే స్లోగన్ తో మద్దతు తెలుపుతున్నారు.... ఇక సోషల్ మీడియాలో మహేష్ కత్తికి మద్దతుగా పలువురి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి...

పసునూరి రవిందర్

పసునూరి రవిందర్

సామాజిక ఉధ్యమకారుడూ, కవీ, రచయిత, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు పొందిన దళిత ఉధ్యమకారుడు అయిన పసునూరి రవిందర్ ఇలా తన అభిప్రాయాన్ని చెప్పారు. మ‌హేష్ క‌త్తిని డిస్ట్ర‌బ్ చేస్తున్న వాళ్ల కోసం నా ''వార్నింగ్ ఆఫ్ ది డ్ర‌మ్స్'' అన్న క‌విత‌లోని లైన్లు చెప్పాల‌నిపిస్తోంది. ''మేం తోలు తెగ‌కుండా గొడ్డును కోసెటోళ్లం జాగ్ర‌త్త‌...! మా కోపం క‌ట్ట‌లు తెగ‌నియ్య‌కుండ్రి!!''

స్కైబాబా (ముస్లిం హక్కుల పోరాట ఉధ్యమ కారుడు కవీ, రచయిత)

స్కైబాబా (ముస్లిం హక్కుల పోరాట ఉధ్యమ కారుడు కవీ, రచయిత)

కత్తి మహేష్ (Mahesh Kathi)కు నా మద్దతు పవన్ కళ్యాణ్ అభిమానులు ఓవరాక్షన్ ఆపాలి

మెర్సీ మార్గరెట్ (అసిస్టెంట్ ఫ్రొఫెసర్, కవయిత్రి, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత)

మెర్సీ మార్గరెట్ (అసిస్టెంట్ ఫ్రొఫెసర్, కవయిత్రి, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత)

ఇవ్వాళ జీవించే హక్కు, మాట్లాడే హక్కు, భావవ్యక్తీకరణ హక్కు రాజ్యాంగం ద్వారా భారతదేశంలోని ప్రతి పౌరుడికి పౌరురాలికి కల్పించబడింది. మహేష్ కత్తి గారు వ్యక్త పరిచింది అతని వ్యక్తిగత అభిప్రాయం. దాని స్వాగతించలేని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అతడి హక్కులకు భంగం కలిగిస్తూ మరీ మూర్ఖత్వంతో ప్రతిదాడులకు దిగడమే కాకుండా ఏకంగా చంపుతాం అని బెదిరించడం అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యానికి విలువనిచ్చే ప్రతి ఒక్కరం ఈ విషయాన్ని ఖండించాలి. ఇంతవరకు నోరు మెదపని పవన్ కళ్యాణ్ గారు అతని అభిమానులను మహేష్ కత్తి గారి మీద దాడిని ఆపమని సందేశం ఇవ్వాలి.

రసూల్ ఖాన్ (కవి)

రసూల్ ఖాన్ (కవి)

ఇప్పుడు జరుగుతున్న దాడి కత్తి మహేష్ పై కాదు రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు (వాక్ స్వాతంత్ర్యం) పై. ప్రజాస్వామ్య బద్దంగా అడిగిన ప్రశ్నలకి మహేష్ కత్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయటాన్ని ఖండిస్తున్నాను.

డాక్టర్.విరించి విరివింటి (ప్రముఖ హృద్రోగ నిపుణులు, కవీ, రచయిత)

డాక్టర్.విరించి విరివింటి (ప్రముఖ హృద్రోగ నిపుణులు, కవీ, రచయిత)

ఒక అభిప్రాయం చెప్పినందుకే చంపేస్తామనడం పూర్తిగా అప్రజాస్వామికం.రేపు పొద్దున పవన్ నిజంగానే సీ.ఎం. అయితే, ప్రతిపక్షం వాల్లు ఆయనను ఏదో సందర్భంలో తిట్టక తప్పదు. అపుడు కూడా ఈ అభిమానులు ఇలాగే రెచ్చిపోతారా? తెలంగాణా సీ.ఎం. కేసీఆర్ ఐతే "ఆడెవడయ్యా...సీల్మా యాక్టరు, ఆడేం సీల్మా యాక్టరో ఏమో...ఒక చిటికేస్తే వేయి ముక్కలైతడు నాకొడుకు" అన్నడు. ఏం కేసీఆర్ మీద కోపాలు రాలేదా ఫ్యాన్స్ కి?. ఇట్టాగే ఫోన్ లు చేసి బెదిరించారా కేసీఆర్ ని?. నిజామాబాదు ఎం.పీ.కవిత కూడా సినిమాల్లో బ్రహ్మానందం ఎంతో రాజకీయాల్లో పవన్ అంత అని అన్నది కదా..? అక్కడ ఎందుకు కోపం చూపించడం లేదు?. . ఈ దేశానికి పవన్ లాగా మహేష్ లాగా ప్రశ్నించే గొంతుకలు కావాలి. ప్రశ్నించే గొంతుకలు కలవాలి. అటు మహేష్ గారు గానీ, పవన్ అభిమానులుగానీ కోపతాపాలకు లోను కాకుండా కలిసి ఆలోచిస్తే సమస్య తీరుతుంది.

శ్రీనివాస్ సాహి (పాత్రికేయుడు, కవి)

శ్రీనివాస్ సాహి (పాత్రికేయుడు, కవి)

ఫ్యాన్స్ పేరుతో ఫ్యూడల్ బానిసల్ని తయారుచేసుకున్న స్వప్రకటిత స్టార్స్.. మీ బానిసలను కొంచెం ఆవేశం తగ్గించుకోమని చెప్పండి.. టీవి9 live లోనే బెదిరింపులకు దిగారంటే వాళ్లలో ఎంత insecurity ఉందో అర్థమవుతోంది.. మొత్తానికి ఇన్నాళ్లకు ఓ సరైనోడు దొరికాడు వాళ్ల దుమ్ము దులపడానికి..

అనీల్ డ్యానీ (ప్రముఖ కవి, రచయిత)

అనీల్ డ్యానీ (ప్రముఖ కవి, రచయిత)

శ్రీ శ్రీ అన్నట్టు జనంలోకి వస్తే లక్ష అంటాం "ప్రశ్నించే మమంల్నే ప్రశ్నిస్తావా అని అడగడం ఒక మూర్ఖత్వం జనం కోసం మాటాలాడుతున్నప్పుడు జనం తిరిగి మాట్లాడకుండా ఎలా ఉంటారు ఇప్పుడు కత్తీ మహేష్ గారు కావొచ్చు రేపు ఇంకోకళ్ళు కావొచ్చు కాని సమాధానం చెప్పాల్సింది పవన్ మాత్రమే ఎందుకంటే పాపం ఫ్యాన్స్ కి ఆయన అంతరంగం తెలీదు కదా

కిరణ్ చర్ల (జర్నలిస్ట్, కవీ రచయిత)

కిరణ్ చర్ల (జర్నలిస్ట్, కవీ రచయిత)

ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులున్నాయి.. బాధ్యతలూ ఉన్నాయి. సో, ముఖానికి రంగేసుకునేవాడు కూడా ఎమ్మెల్యే కావచ్చు... ముఖ్యమంత్రీ కావచ్చు. నో డౌట్. కానీ, మొదట నా టిక్కెట్టు డబ్బులకు న్యాయం చేయాలి. అంతకంటే ఎక్కువ చేయాలనుకుంటే... ఇంకా చాలా తెలిసినవాడై ఉండాలి.. ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అని ఊగిపోతే సరిపోదు. రాజకీయాలు ఎవడి పేటెంట్ ఫీల్డ్ కాదు.. జనసేన వచ్చిన నాటి నుంచి అడిగిన ప్రశ్నలెన్ని, చేసిన చేతలెన్ని.. అన్నిటికీ మించి వేళ్లు నొప్పెట్టిన ట్వీట్ లెన్ని...?? కానీ, తెరపై హీరోలు నిజజీవితంలో కూడా హీరోలవుతారని ఎలా నమ్మేస్తున్నారు . grow up boss..

వరలక్ష్మి (విరసం కార్యదర్శి, అరుణతార పత్రిక సంపాదకులు, మానవహక్కుల ఉధ్యమ కార్యకర్త)

వరలక్ష్మి (విరసం కార్యదర్శి, అరుణతార పత్రిక సంపాదకులు, మానవహక్కుల ఉధ్యమ కార్యకర్త)

ఇదంతా పవన్ కళ్యాణ్ కు తెలీదా? బహుశా తెలిసే ఉంటుంది. తన మంది బలాన్ని చూసుకొని దాన్ని ఎన్నికల పెట్టుబడిగా ఉపయోగించుకోవడం గురించి అతను ఆలోచిస్తుండవచ్చు. 'ఇజం' అని చెప్పుకుంటూ వీళ్ళు చేస్తున్నది ప్రజల్ని, ముఖ్యంగా యువకుల్ని పిచ్చివాళ్లను చేయడమే. ప్రజల పక్షాన ఆలోచిస్తున్నవాళ్లందరం దీన్ని ముక్తకంఠంతో ఖండించాలి. ప్రత్యామ్నాయ సంస్కృతి, రాజకీయాలు ఎంత బలహీనపడుతూ వస్తాయో అంతగా ఈ దౌర్బల్యం సమాజాన్ని ఆవహిస్తుంది. అందువల్ల ఆమేరకు మనం ఏం చేయగలమో ఆలోచిద్దాం

English summary
Opinions of Writers and Activists Who supports Mahesh katti in Social Meadia
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu